Begin typing your search above and press return to search.

అన్నింటా!... బాబు ఫాలోస్‌ కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2019 10:14 AM GMT
అన్నింటా!... బాబు ఫాలోస్‌ కేసీఆర్‌!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వైఖ‌రి ఎప్పుడూ భిన్నంగానే సాగుతూ ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైరి వ‌ర్గాల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించ‌డం - ఆ త‌ర్వాత అవే వైరి వ‌ర్గాల‌ను ఫాలో కావాలంటూ త‌న పార్టీ కేడ‌ర్‌కు ఆదేశాలు జారీ చేయ‌డం చూస్తుంటే... నిజంగానే బాబు వైఖ‌రి పూర్తిగా విభిన్న‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఇప్పుడు ఈ త‌ర‌హా కొత్త చ‌ర్చ ఎందుక‌న్న విష‌యానికి వ‌స్తే... నేటి ఉద‌యం త‌న పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు విన్న త‌ర్వాత ఈ త‌ర‌హా విశ్లేష‌ణ త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌ర‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా నేటి టెలికాన్ఫ‌రెన్స్‌ లో బాబు నోట నుంచి వ‌చ్చిన మాట‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీకి వ‌చ్చిన సీట్ల సంఖ్య‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. అంతేకాకుండా అన్ని సీట్లు కూడా కేసీఆర్ సార‌థ్యంలోని టీఆర్ ఎస్‌ కు ఎలా వ‌చ్చాయ‌ని కూడా ఆయ‌న ఆశ్య‌ర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే... తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని బాబు ఓ రూలింగ్ ఇచ్చేశారు.

ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌ని కేసీఆర్ కు 88 సీట్లు వ‌చ్చాయ‌ని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు... ఏపీ ప్ర‌జ‌ల‌కు అన్నీ చేసిన టీడీపీకి ఎన్ని సీట్లు రావాల‌ని కూడా ఆయ‌న త‌న పార్టీ కేడ‌ర్‌ ను ప్ర‌శ్నించారు. *ఏమీ చేయ‌ని కేసీఆర్‌ కు 88 వ‌చ్చాయి. మ‌రి అన్నీ చేసిన మ‌న‌కు ఎన్ని రావాలి?* చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. అవ‌త‌లి వైపు నుంచి స‌మాధానం రాక ముందే టీడీపీ టార్గెట్ ఏమిటో కూడా చంద్ర‌బాబే చెప్పేశారు. వ‌చ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్ల‌లో మొత్తంగా టీడీపీనే గెల‌వాల‌ని, అంటే... ఏపీలోని 25 ఎంపీ సీట్ల‌లో పార్టీ అభ్య‌ర్థులే గెల‌వాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. అదే స‌మ‌యంలో 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీకి క‌నీసం 150 సీట్లు ద‌క్కాల‌ని కూడా ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర సీట్లు రావ‌డానికి ఏం చేయాల‌న్న విష‌యంపై మ‌రింత లోతుగా వెళ్లిన చంద్ర‌బాబు... ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని - ఆయా ప‌థ‌కాల‌తో ఎవ‌రెంత మేర ల‌బ్ధి చెందార‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు. ఈ బృహ‌త్కార్యాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు పార్టీ నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు అహ‌ర‌హం శ్ర‌మించాల్సిందేన‌ని కూడా చంద్ర‌బాబు రూలింగ్ ఇచ్చేశారు.

ఇక్క‌డిదాకా బాగానే ఉన్నా... తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ స‌ర్కారు ఏమీ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పిన మాట‌పై ఇప్పుడు సెటైర్ల మీద సెటైర్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వంగా ఏమీ చేయ‌ని ప్ర‌భుత్వాలు - ప్ర‌జా వ్య‌త‌రేక పాల‌న‌ను అందించే పార్టీల‌ను ప్ర‌జ‌లు ఎందుకు ఆహ్వానిస్తార‌న్న‌దే ఇప్పుడు అతి పెద్ద ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌ను దేశంలోనే సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ న‌ని త‌న‌ను తాను ఆకాశానికెత్తేసుకునే చంద్ర‌బాబు సంధించ‌డం నిజంగానే ఆస‌క్తి గొలిపేదే. అంతేకాకుండా ఏమీ చేయ‌ని కేసీఆర్ స‌ర్కారు అంటూనే... కేసీఆర్ సాధించిన సీట్ల సంఖ్య‌ను అక్ష‌రం పొల్లు పోకుండా ప‌లుకుతున్న చంద్ర‌బాబు... కేసీఆర్ తెలంగాణ‌లో అమ‌లు చేసిన వ్యూహాల‌ను కూడా త‌మ పార్టీ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావిస్తున్నారంటే... ప్ర‌తి విష‌యంలోనూ కేసీఆర్ ను చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న‌ట్టే క‌దా. మ‌రి ఈ లాజిక్‌ను కూడా మ‌రిచిపోయిన చంద్ర‌బాబు... కేసీఆర్ కు అక్క‌డ అన్ని సీట్లు వ‌చ్చాయి, మ‌రి మ‌న‌కెంత రావాలంటూ పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం చూస్తే.. నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.