Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ..ఫ్లెక్సీ రాజకీయం.. బాబుకు 'పవన్' బొప్పి

By:  Tupaki Desk   |   10 Nov 2018 6:57 AM GMT
ఛీ..ఛీ..ఫ్లెక్సీ రాజకీయం.. బాబుకు పవన్ బొప్పి
X
జనసేనాని టీడీపీకి తలనొప్పిగా మారాడు. గత ఎన్నికల్లో పవన్ తమ బలమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మైండ్ గేమ్ కు తెరలేపారు. జగన్ - పవన్ కలిసి పోయారని - త్వరలో ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. బాబు నైజం తెలుసుకున్న పవన్ - అంతే స్థాయిలో మండిపడుతున్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గట్టెక్కేందుకు పవన్ ఎంతగానో దోహదపడ్డారనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వ అవినీతి - ఆరాచకాలను గమనించిన పవన్.. తిరుగుబావుటా ఎగరవేసి జనసేనను స్థాపించారు. బలమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో స్పందించని చంద్రబాబు అండ్ కో.. ఆ తరువాత తమకు తలనొప్పిగా మారుతున్నాడనుకున్నారు. బోడి గుండుకు మోకాలికి ముడపెట్టడం మొదలు పెట్టారు. బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారని - జగన్ తో మిలాఖత్ అయ్యారని ప్రచారం మొదలుపెట్టారు.

టీడీపీ ఆరోపణలను సవాల్ గా తీసుకున్న వపన్ కూడా అంతే స్థాయిలో వాగ్భాణాలు సంధిస్తున్నారు. రాజకీయాల్లో కొత్త అయినా - పరిణితి చెందిన నాయకుడిగా ప్రతి విషయంలోనూ స్పందిస్తున్నారు. ఈ దశలో మానసికంగా కుంగదీసేందుకు అన్ని అస్త్రాలను టీడీపీ నేతలు వాడేస్తున్నారు. ఇటీవల విజయవాడలో ఫ్లెక్సీల రాజకీయాలకు తెరతీశారు. టీటీడీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయించి.. అంత దమ్మే ఉంటే అన్న చిరంజీవిని ఎందుకు గెలిపించుకోలేకపోయావు - రాఫెల్ కుంభకోణంపై మోడీని విమర్శించడం లేదు ఎందుకు అంటూ పవన్ పై ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు.

మరోవైపు జగన్ - పవన్ ద్వారా టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి బట్టబయలు అవుతుండటంతో.. కప్పిపుచ్చుకునేందుకు మరో ఎత్తుగడగా నోరు మూయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రజల్లో గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో బీజేపీ చెప్పినట్లు ఆడుతున్నారనే ప్రచారానికి తెరలేపారు. కోడి కత్తి నాటకం మొదలుపెట్టారు. ఈ తరహా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విశ్లేషకులు అంటున్నారు. ఫ్లెక్సీలు - ఆరోపణలతో బజారు కీడ్చి.. నోరు నెక్కేయాలని తలిస్తే.. చంద్రబాబుకు భవిష్యత్తులో భంగపాటు తప్పదని మరికొందరు హెచ్చరిస్తున్నారు.