Begin typing your search above and press return to search.

చంద్రబాబు ... కొత్త గడ్డి కుంభకోణం!

By:  Tupaki Desk   |   18 Dec 2017 4:16 AM GMT
చంద్రబాబు ... కొత్త గడ్డి కుంభకోణం!
X
‘గడ్డి కుంభకోణం’ అనే పదం ఈ దేశంలోని ప్రజలందరికీ చాలా సుపరిచితమైనది. గడ్డి పేరుతో వందల కోట్ల రూపాయలు కాజేసి.. జీవితంలో అసలు మళ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేకుండా పోయిన ఒకప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తున్నంత వరకూ ఎవరూ గడ్డి కుంభకోణాన్ని మరచిపోలేరు. అయితే చంద్రబాబునాయుడు కూడా తాజాగా మరో కోణంలోంచి మరో రకమైన గడ్డి కుంభకోణానికి తెర తీస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆలోచన కింద పత్రికల్లో వస్తున్న వార్తలను గమనిస్తే.. ప్రభుత్వం చేసే గడ్డి వ్యాపారం కింద దీనిని గుర్తిస్తున్నారు. కానీ ఈ గడ్డి వ్యాపారం ముసుగులో సాలీనా వంద కోట్ల రూపాయల మేర చేతులు మారే అవకాశం కూడా ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు.

చంద్రబాబునాయుడులో పశు సంపద మీద ప్రేమ పొంగుకొచ్చినట్లుగా.. పశువలకు వేసవికాలంలో గడ్డి దొరక్క కబేళాలకు తరలిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. అలాంటి దుస్థితిని నివారించడమే లక్ష్యం అన్నట్లుగా ఆయన ఇలాంటి గడ్డి పథకానికి సంకల్పించినట్లు చెప్పుకుంటున్నారు. కానీ దీని తెరవెనుక చాలా మర్మ రహస్యాలు ఉన్నాయనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పశువులకు గ్రాసం ఇబ్బంది లేకుండా... ఎప్పటికప్పుడు.. గడ్డిని అందుబాటులో ఉంచడానికి సరిపడా గడ్డి పెంచేలా.. రైతుల్ని ప్రోత్సహిస్తోంటే.. దానివలన పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ప్రభుత్వం భావిస్తున్నదట. అందువలన.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను - స్వచ్ఛందసంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నదిట. అంటే తిరిగి రైతుల భూములను పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి కౌలు రూపేణా బదలాయించేసే మరో కొత్త దోపిడీకి ప్రభుత్వం తెరతీస్తున్నదన్నమాట. రైతులనుంచి పారిశ్రామికవేత్తలు లేదా స్వచ్ఛంద సంస్థల ముసుగులో అధికార పార్టీ తైనాతీలు వందల ఎకరాల భూముల్ని రైతుల్నించి కౌలుకు తీసుకుంటారు. వారి కౌలు మొత్తాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ సంస్థలు గడ్డి పండించడానికి అయ్యే ఖర్చులు సమస్తం ప్రభుత్వమే భరిస్తుంది. పొలం యజమానులు కాస్తా కూలీలుగా వారి పొలాల్లోనే కూలి చేసుకోవచ్చు. గడ్డి దిగుబడి వచ్చిన తర్వాత.. ప్రభుత్వమే వారినుంచి కిలో నాలుగు రూపాయల వంతున కొనుక్కుంటుంది. లాభాలను మాత్రం మధ్యలో ఉన్న దళారీలు దండుకుంటారు. ఇలా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల్లో గడ్డి పెంపకం పేరిట దోచుకోవడం కోసం - తమ అనుకూలమైన వ్యక్తులకు దోచిపెట్టడం కోసం.. ప్రభుత్వం భారీ ప్రణాళిక రచించినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు ఎంత సమర్థంగా.. ఎంత లౌక్యంగా ఈ కొత్త గడ్డి కుంభకోణాన్ని ముందుకు నడిపిస్తారో చూడాలని ప్రజలు అనుకుంటున్నారు.