Begin typing your search above and press return to search.
సాక్షిని ఫుల్లుగా ఫాలో అవుతున్న చంద్రబాబు
By: Tupaki Desk | 26 Feb 2017 9:44 AM GMT‘తమ్ముళ్లూ... సాక్షి పత్రికను ఎవరూ చదవొద్దు. సాక్షి టీవీనీ ఎవరూ చూడొద్దు’’.. ఇదీ చంద్రబాబు నిత్యం చెప్పేమాట. కానీ.. చంద్రబాబు మాత్రం సాక్షి పత్రికను చదవడమే కాకుండా ఏకంగా కట్ చేసి దాచిపెట్టుకుంటున్నారట. అంతేకాదు.. సాక్షిలో వచ్చిన కథనాలను ప్రామాణికంగా తీసుకుని అందులోని వాస్తవాల ఆధారంగా తన ఎమ్మెల్యేలు - మంత్రులు - నేతలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారట.
ఇటీవల జిల్లాల వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే గుంటూరు - ప్రకాశం - అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు షాకింగ్ అనుభవం ఎదురైందట. జిల్లాల్లో నేతల వ్యహారశైలి - గ్రూపు రాజకీయాలపై సమీక్ష చేసిన చంద్రబాబు.. సమావేశంలో సాక్షి పత్రిక క్లిప్పింగులను భారీగా వారి ముందుంచారట. ఇదేంటని అడుగుతూ వారిని సమాధానం చెప్పే అవకాశం లేకుండా సాక్షి కథనాలను ఆధారాలుగా చూపించారట.
నేతల అవినీతి వ్యవహారాలు - బంధువుల బాగోతాలు - వర్గ విబేధాలకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు కట్టలుకట్టలుగా నేతల ముందుంచారట చంద్రబాబు. సాక్షి పత్రిక జిల్లా ఎడిషన్ లో వచ్చిన పేపర్ క్లిప్పింగులు కూడా చంద్రబాబు వద్ద ఉండడంతో నేతలకు నోట మాటరాలేదట. సాక్షి పత్రిక తమకు వ్యతిరేకంగా కావాలనే రాసిందని కొందరు నేతలు చెప్పేందుకు ప్రయత్నించినా చంద్రబాబు మాత్రం సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనాలను పార్టీ ప్రొగ్రామింగ్ కమిటి చైర్మన్ వీవి చౌదరి టీం ద్వారా చంద్రబాబు తెప్పించుకుంటున్నారట. దీంతో ఏ జిల్లాలో ఏ నేతపై కథనం వచ్చినా అది చంద్రబాబుకు చేరిపోతోంది. మిగిలిన పత్రికలు ఎలాగో టీడీపీకి వ్యతిరేకంగా కథనాలు రాయకపోవడంతో చంద్రబాబు… సాక్షి పత్రికను బాగా ఫాలో అవుతున్నారని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/