Begin typing your search above and press return to search.

వెంక‌య్య రీతిలోనే మీడియాకు బాబు క్లాస్‌

By:  Tupaki Desk   |   2 Feb 2017 12:26 PM IST
వెంక‌య్య రీతిలోనే మీడియాకు బాబు క్లాస్‌
X
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాత్రంలోకి టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశార‌ని న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ విలేక‌రుల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తరచూ ఈ ఇద్ద‌రు నేత‌లు చెట్టపట్టాలేసుకొని తిరగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో వెంక‌య్య ట్రెండ్ ను బాబు వంట‌ బ‌ట్టించుకున్నార‌ని చెప్తున్నారు. సాధారణంగా ఏ సభలోనైనా ముందుగా సభికులకు క్రమశిక్షణపై వెంకయ్య ‘క్లాస్’ తీసుకుంటారు. ‘అంతా నిశ్శబ్దంగా వుండాలి.. సెల్‌ ఫోన్‌ లు స్విచ్ ఆఫ్ చేయాలి.. ఫొటోగ్రాఫర్లు నిలబడవద్దు.. వెనుకవారికి కనబడటానికి అందరూ కూర్చోవాలి.. వేదికపై వున్నవారిని పేరుపేరునా వక్తలు ప్రస్తావించవద్దు.. సభకు నమస్కారం అంటే చాలు..’ అంటూ వెంక‌య్య హిత‌బోధ కొన‌సాగుతుంటుంది. ఇపుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు అదే చేస్తున్నారని అంటున్నారు.

తాజాగా జ‌రిగిన రెండు బ‌హిరంగ స‌మావేశాల్లోనూ ఇదే రీతిని చంద్ర‌బాబు ఫాలో అయ్యార‌ని అంటున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు వెంకయ్య పాత్రను పోషించి అందర్నీ విస్మయపరిచారు. స‌రే అపుడు వెంక‌య్య ఉన్నారు కాబ‌ట్టి బాబు ఇలా చేశార‌ని అనుకుందామంటే అనంత‌రం జ‌రిగిన రెండు స‌మావేశాల్లో అదే రీతిలో బాబు మాట్లాడార‌ని చెప్తున్నారు. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌మావేశంలో మంత్రి ఒక‌రు ఇలా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో జోక్యం చేసుకున్న బాబు వెంక‌య్య డైలాగ్ ల‌నే వ‌ల్లె వేసి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించేలా చేశార‌ని అంటున్నారు. ఆర్నెళ్లు సాహ‌వాసం చేస్తే ‘వారు వీరు.. వీరు వారవుతార’ని పెద్దలంటారని అదే రీతిలో బాబు వెంక‌య్య‌ను ఫాలో అయిపోతున్న‌ట్లునార‌ని చెప్తున్నారు. అయితే కొద్ది స‌మ‌యం మాత్ర‌మే మాట్లాడాల‌ని చెప్పిన చంద్ర‌బాబు అనంత‌రం త‌న ప‌రిపాన‌ - పార్టీ - క్ర‌మ‌శిక్ష‌ణ‌ - దేశంలోని న‌గ‌దు ర‌హిత ప‌రిణామాలు - దావోస్ ప‌ర్య‌ట‌న వంటి విష‌యాల‌తో సుమారు గంట పాటు ప్ర‌సంగించ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/