Begin typing your search above and press return to search.

పీక్ స్టేజ్; అధ్యాత్మిక బాబువ

By:  Tupaki Desk   |   21 Oct 2015 3:28 PM GMT
పీక్ స్టేజ్; అధ్యాత్మిక బాబువ
X
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇటీవల చంద్రబాబు పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ చంద్రబాను కాస్త భిన్నమైన ప్రశ్న వేశారు.

చంద్రబాబు ఈ మధ్య దేవుడ్ని తెగ నమ్మేస్తున్నారు? ఈ మార్పుకు కారణం? అన్న ప్రశ్న వేసినప్పుడు.. చంద్రబాబు కూల్ గా బదులిస్తూ.. ప్రజలు దేన్ని ఎక్కువగా నమ్ముతారో దాన్ని తాను నమ్ముతానని.. వివిధ వర్గాల ప్రజలు అత్యధికంగా దేవుడ్ని నమ్ముతున్నారని.. అలాంటప్పుడు వారు నమ్మే దేవుడ్ని తాను నమ్మటం తప్పేం కాదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

పదేళ్ల పాటు విపక్ష నేతగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న చంద్రబాబు.. తాజాగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి నమ్మకాలకు.. వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకుస్థాపన కార్యక్రమాన్ని పరిశీలిస్తే.. భావోద్వేగానికి.. అధ్యాత్మిక అత్తరును కలపటం ద్వారా చంద్రబాబు చెలరేగిపోతున్న పరిస్థితి.

పట్టు చిక్కాలే కానీ తన సత్తా ప్రదర్శించాలని తపిస్తున్న బాబుకు తాజా చేపట్టిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి.. అంతులేని ఇమేజ్ ను మూటగట్టుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శంకుస్థాపనకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్నినిశితంగా పరిశీలిస్తున్న వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి కార్యక్రమాన్ని వీలైనంత అధ్యాత్మికత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శంకుస్థాపనకు సంబంధించిన పనులు చూస్తే.. ఏపీ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి నీటిని.. మట్టిని తప్పనిసరిగా సేకరించటంతో పాటు.. వాటన్నింటిని సేకరించటం.. అవన్నీ కలిపిన మట్టి మిశ్రమాన్ని.. పవిత్ర జలాన్ని బుధవారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ లో పై నుంచి అమరావతి ప్రాంతంలో చల్లిన తీరు చూస్తే.. బాబులోని అధ్యాత్మికం పీక్ స్టేజ్ కు వెళ్లిందన్న భావన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రజల మనసులు దోచుకునేలా అధ్యాత్మికతను ఏ మాత్రం మిస్ చేయకుండా.. మఖం మీద బొట్ట పెట్టుకొని పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఆయన.. సంప్రదాయానికి ఏ చిన్న ఇబ్బంది చోటు చేసుకోకుండా వ్యవహరిస్తున్న బాబు వైఖరి పలువుర్ని ఆకర్షిస్తోందనటంలో సందేహం లేదు.