Begin typing your search above and press return to search.
ప్రత్యేకం కోసం బాబు రంగంలోకి దిగారా?
By: Tupaki Desk | 12 Aug 2015 4:48 AM GMTఅనుకుంటారు కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు తనదే పైచేయిగా ఉండే పరిస్థితులకు అలవాటు పడిన చంద్రబాబుకు 2004 నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఆయన చక్రం తిప్పుతుంటే మిగిలిన వారు చూస్తుండిపోయేవారే తప్పించి.. అడ్డుకునే పరిస్థితి ఉండేది కాదు.
అలాంటి చంద్రబాబు.. 2004లో అధికారం కోల్పోవటం.. అది 2014 వరకూ కొనసాగటం.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినా.. కేంద్రంలో ఏర్పడ్డ మోడీ సర్కారు సూపర్ పవర్ గా అవతరించటంతో చంద్రబాబు చేష్టలుడిగి చూస్తుండిపోయే పరిస్థితి. దీనికి తోడు బీజేపీలో అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా కారణంగా చెప్పొచ్చు. వాజ్ పేయ్.. అద్వానీ తరం నాటి రాజకీయానికి.. మోడీ రాజకీయానికి మధ్యనున్న తేడాను చంద్రబాబు చాలా త్వరగానే గుర్తించి.. ఢిల్లీకి కాస్త దూరంగా ఉంటున్నారు.
మోడీ లాంటి నేత వెలిగిపోతున్న క్రమంలో.. ఆ దరిదాపుల్లోకి వెళ్లటం ఎంత కష్టమో.. వెళ్లినా దాని వల్ల నష్టమే తప్ప..లాభం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు లాంటి నేత గుర్తించేందుకు అట్టే సమయం పట్టదు. అందుకే.. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ప్రధానిని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు.. తన న్యాయమైన డిమాండ్లను కూడా ఆయన సాధించుకోలేని దుస్థితి.
చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని.. కేంద్రమంత్రుల్ని ఎన్నిసార్లు కలిసినా.. ప్రయాణం ఖర్చులు.. బొకే ఖర్చులకు సరిపడా నిధులు కూడా రాలని పరిస్థితి. అందుకేనేమో.. కేంద్రం దగ్గరకు వెళ్లే కన్నా ఏదైనా విదేశీ పర్యటనకు వెళితే రెండు ప్రాజెక్టులు అయినా వచ్చే పరిస్థితి ఉంటుందని బాబు అండ్ కో భావిస్తున్నట్లుగా జోకులేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయాన్ని బాబు ప్రస్తావించే సీన్ లేని సిట్ట్యూవేషన్. అలాంటి పరిస్థితే ఉంటే.. కేంద్రంతో విడాకులు తీసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చే వారున్నారు. ఏపీకి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు నష్టమే తప్పంచి ఎలాంటి లాభం ఉండదు. వచ్చే చిల్లర డబ్బులు కూడా రాలని పరిస్థితి ఉంటుంది.
అందుకే.. తన టైం కోసం బాబు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితి. భావోద్వేగ రాజకీయం ఎంత బలంగా ఉంటుందో.. అది తనకెంత నష్టం చేస్తుందన్న విషయం బాబుకు తెలియంది కాదు. కానీ.. ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి లాంటి పరిస్థితుల్లో అటు మోడీని వ్యతిరేకించే దమ్ము లేక.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిలదీసే ధైర్యం లేక కాలం గడిపేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తిరుపతికి చెందిన కోటి అనే వ్యక్తి ఏపీకి ప్రత్యేకహోదా కోసం తనను తాను ఆత్మాహుతి చేసుకోవటంతో సీమాంధ్రుల గుండెలు మండాయి. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇలాంటి అవకాశం కోసం చూస్తున్న విపక్షాలు కేంద్ర.. రాష్ట్ర వైఖరుల్ని ఎండగడుతూ నిరసనలు.. ఆందోళనల్ని పెంచాయి. ఇవన్నీ ఏపీకి ఇబ్బంది కలిగించే పరిణామాలే. గత మూడు రోజులుగా పెద్దగా స్పందించని చంద్రబాబు.. మంగళవారం కేంద్రం దృష్టికి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల్ని చర్చించినట్లు చెబుతున్నారు.
ఏపీ బంద్ విజయవంతం కావటం.. ఇలాంటి పరిస్థితే కొనసాగితే రాజకీయంగా ఇబ్బంది ఖాయమన్న విషయాన్ని గుర్తించటంతో పాటు.. ఏపీ ప్రత్యేకహోదాపై తేల్చాలని.. సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడిని షురూ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం ఇప్పటికే పలు రకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో.. ఇలాంటి వైఖరితో నష్టమే తప్పించి.. లాభం ఉండదని తేల్చారు.
మంగళవారం ఆయన.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు.. మరో కేంద్రమంత్రి.. సీమాంధ్రుడైన వెంకయ్యనాయుడితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నిర్ణయం తీసుకోవాలని.. లేని పక్షంలో రాష్ట్రంలోని పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని వారితో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అదును చూసి రంగంలోకి దిగి.. కేంద్రం దగ్గర ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించిన చంద్రబాబు మాట ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.