Begin typing your search above and press return to search.
కార్యకర్తల కోసం బాబు కోట్లు ఖర్చు పెట్టారా?
By: Tupaki Desk | 7 Oct 2016 9:27 AM GMTదేశంలో రాజకీయ పార్టీలు చాలానే ఉంటాయి. కానీ.. ఏ పార్టీ కూడా ఆలోచించని కోణంలో ఆలోచించటమే కాదు.. ఆ ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే... అది తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలేమో? జాతీయపార్టీలు సైతం చేయలేని పనిని ఒక ప్రాంతీయ పార్టీ చేయటం చిన్న విషయం కాదనే చెప్పాలి. కార్యకర్తల భుజాల మీద పెరిగే పార్టీలు.. తాము వాడేసుకున్న భుజాలకు కాస్త అయినా తిరిగి ఇచ్చాయా? అన్న ప్రశ్న వేసుకుంటే సందేహమే. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం.. కార్యకర్తలు.. చోటా చేతల అవసరం ఏమిటో అర్థమైన చంద్రబాబు.. వారికేమైనా చేయాలన్న తపనతో మొదలెట్టిన బీమా కార్యక్రమం ఇప్పుడు పలు పార్టీలను ఆకర్షిస్తోంది.
రాజకీయంగా బాబును తిట్టేసే వారు సైతం.. ఆయన పార్టీ షురూ చేసిన సామూహిక బీమా పథకంపై ప్రశంసలు వ్యక్తమయ్యే పరిస్థితి. దీంతో పాటు.. పార్టీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవటం లాంటి కార్యక్రమాలు మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీలో కాస్త ఎక్కువనే చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా పథకాన్ని వర్తించేలా చేయటం.. అందుకోసం భారీ మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించే విధానం చూస్తే.. కాస్త ఆశ్చర్యంగా అనిపించక మానదు.
తాజాగా.. కార్యకర్తల బీమా కోసం తెలుగుదేశం పార్టీ చెల్లించిన ప్రీమియం ఎంతో తెలుసా?అక్షరాల రూ.15 కోట్లు. కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించిన వైనం చూస్తే.. పార్టీ కోసం శ్రమించే వారి కోసం బాబు పెద్దగా పట్టించుకోరన్న విమర్శలు తప్పన్న భావన కలగటం ఖాయం. ఏదేమైనా పార్టీ కార్యకర్తల కోసం ఇన్నేసి కోట్లు బాబు పార్టీ ఖర్చు చేయటం అభినందించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/