Begin typing your search above and press return to search.

కామెడీ కాకపోతే.. ఉల్లి ధరలకు జగన్ కు లింకేంది బాబు?

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:22 AM GMT
కామెడీ కాకపోతే.. ఉల్లి ధరలకు జగన్ కు లింకేంది బాబు?
X
టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఫస్ట్రేషన్ అంతకంతకూ ఎక్కువ అవుతోందా? ఏపీ సీఎంను ఏదోలా తిట్టటమే ఎజెండా పెట్టుకొని ముందు వెనుకా చూసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారా? కరెంటు అఫైర్స్ ను ముక్కన పెట్టేసుకొని.. ప్రతి దానికి జగనే కారణమన్న తన రోటీన్ డైలాగ్ ను తాజాగా వాడి అభాసు పాలయ్యారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై నిత్యం ఏదో ఒక విమర్శ చేయాలి. అది కూడా పొద్దున ఒకటి.. మధ్యామ్నం మరొకటి.. సాయంత్రం ఇంకొకటి.. బాగోదు కాబట్టి ఆగుతున్నారు కానీ.. తన మీడియా ఓకే అనాలే కానీ రాత్రి పూట కూడా ఇంకో విమర్శ చేసేసి.. ఎంచక్కా పడుకుంటారేమోనన్న భావన కలుగక మానదు.

మొన్నటివరకూ ఇసుక కొరత మీద రచ్చ రచ్చ చేసిన బాబు అండ్ కోకు ఇప్పుడు సరైన ఇష్యూనే లేదు ప్రస్తావించటానికి. దీంతో ఏదో ఒక విమర్శను తెర మీదకు తెచ్చి.. దాన్ని జగన్ తో లింకెట్టి మైకుల ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తునన బాబు తాజాగా చేసిన ఉల్లి వ్యాఖ్యలతో ఆయన మరోసారి అభాసుపాలయ్యారు.

ఉల్లిధరలు ఇంతలా పెరిగిపోవటానికి కారణం జగన్ చేతకానితనంగా చిల్లర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. దేశంలో మరెక్కడా లేకుండా కేవలం ఏపీలో మాత్రమే ఉల్లి కేజీ రూ.110 (బాబుగారి మాటల్లో ఇంత చెబుతుంటే అందుకు భిన్నంగా.. మార్కెట్ వర్గాలు మాత్రం ఇప్పుడు కేజీ రూ.150 అని చెబుతున్నారు) కావటం వెనుక ఏపీ ముఖ్యమంత్రి వైఫల్యం ఉందని విరుచుకుపడుతున్నారు.

ఉల్లి ధరలు రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండటం.. దీంతో ఉల్లి కొరతను తీర్చేందుకు గ్రీస్ నుంచి ఉల్లిని భారీగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటటం మోడీ సర్కారు ఫెయిల్ అని అందరూ అంటుంటే.. అదేమీ పట్టకుండా.. తనదైన రందిలో జగన్ కు ఉల్లి ధరలకూ లింకెట్టేసిన బాబు మాటలు విన్నంతనే..మరీ ఇంత కామెడీగా మాట్లాడతారేంటి? అన్న సందేహం కలుగక మానదు.