Begin typing your search above and press return to search.

ప్రపంచ బ్యాంకు దగ్గర బాబు పరపతి పాయే!

By:  Tupaki Desk   |   23 Aug 2018 6:26 AM GMT
ప్రపంచ బ్యాంకు దగ్గర బాబు పరపతి పాయే!
X
చంద్రబాబు అంతకుముందు రెండు టెర్ములు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెగ తెచ్చేవారు. బాబు ఎంతడిగితే అంత సాంక్షన్ అయిపోయేది. కానీ... రాష్ట్ర విభజన తరువాత మళ్లీ ఏపీ సీఎం అయిన చంద్రబాబుకు ప్రపంచబ్యాంకులో అంతకుముందున్నంత పరపతి ఉన్నట్లు కనిపించడం లేదు.

చంద్రబాబు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ ప్రాజెక్టులకు - ఇరిగేషన్ ప్రాజెక్టులకు - మిగతా అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి భారీగా నిధులు తెచ్చారు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పాలనను మెచ్చుకున్నారు. కానీ... ఎందుకో ఇప్పుడు ప్రపంచ బ్యాంకు చంద్రబాబును పెద్దగా పట్టించుకోవడం లేదు.

4,700 కోట్ల రుణం కోసం చంద్రబాబు ప్రభుత్వం పెట్టుకున్న అప్లికేషన్ ప్రపంచ బ్యాంకు దగ్గర చాలాకాలంగా క్లియర్ కాలేదు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆయన ప్రపంచబ్యాంకు నుంచి రుణం కోరగా మంజూరు కావడం లేదు. అమరావతి భూసమీకరణకు వ్యతిరేకంగా రైతుల నుంచి ప్రపంచ బ్యాంకుకు లేఖలు వెళ్లడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

అయితే.. ప్రపంచ బ్యాంకు నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో ఎన్నికల్లోగా డబ్బులొచ్చే సూచనలు కనిపించక చంద్రబాబు ఆ రుణంపై ఆశలు వదులుకున్నట్లు సమాచారం. ఇతర మార్గాల కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చూస్తోందట.