Begin typing your search above and press return to search.
యాడ్స్ తో దంచి కొడుతున్న చంద్రబాబు
By: Tupaki Desk | 26 March 2019 6:01 AM GMTప్రచారం చేయడంలో - తమ ప్రచారాన్ని అందరూ చూసేలా చేయడంలో చంద్రబాబు నేర్పరి. అసలు తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి, తను చేయకపోయినా చేశాను అని కలరింగేచ్చేలా ఉండడం కోసం కొన్ని మీడియా సంస్థల్ని చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. మామూలు టైమ్ లో యాడ్స్ ని కుమ్మరించే చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఊరుకుంటారా. పేపర్ - టీవీ - వెబ్ సైట్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ టీడీపీ యాడ్స్ తో నింపేస్తున్నారు. ఇక టీడీపీలో ప్లే అవుతున్న టీడీపీ యాడ్స్ అందర్ని ఆకట్టుకున్నాయి. యాడ్స్ రూపొందించిన బోయపాటి శ్రీనుకి కూడా మంచి పేరే వచ్చింది.
సాధారణంగా మనకు యాడ్స్ అంటే టీవీ - పేపర్ - వెబ్ సైట్ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు యాడ్స్ ఏ రేంజ్ లో ఇస్తున్నారంటే.. క్రికెట్ బెట్టింగ్ కోసం క్రికెట్ ఎక్చేంజ్ అని ఒక బెట్టింగ్ యాప్ ఉంటుంది. ఇది క్రికెట్ అప్ డేట్స్ కోసం పెట్టింది కాదు. ఓన్లీ బెట్టింగ్ కోసమే. చివరకు అందులో కూడా టీడీపీ యాడ్స్ కన్పిస్తున్నాయంటే యాడ్స్ కోసం చంద్రబాబు ఏ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో టీడీపీతో పోలిస్తే యాడ్స్ విషయంలో వైసీపీ చాలా వెనకబడిపోయింది. వెనకబడి పోవడం అనేకన్నా యాడ్స్ విషయంలో వైసీపీ గుండుసున్నా అంటే ఇంకా మంచిది . రావడానికైతే యాడ్స్ వస్తున్నాయి కానీ అవేమంత క్వాలిటీగా లేవు. ఇంకా చెప్పాలంటే.. జగన్ సొంత ఛానెల్ అయినా సాక్షి టీవీలో పనిచేస్తున్న ట్రైనీ ఎడిటర్ కు ఇచ్చిన అంతకంటే మంచి యాడ్స్ తీసి పెట్టేవాడు అని జనాలు కామెడీ చేసుకుంటున్నారు. విజయం ముంగిట నిలబడిన సమయంలో.. ఇలాంటి క్వాలిటీ లేని యాడ్స్ తో ప్రజలముందుకు రావడం వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.