Begin typing your search above and press return to search.

బాబు నోట క‌బ్జా చేయాల‌ని ఉంద‌న్న మాట‌

By:  Tupaki Desk   |   17 Aug 2017 5:23 AM GMT
బాబు నోట క‌బ్జా చేయాల‌ని ఉంద‌న్న మాట‌
X
మీరు చ‌దివింది నిజంగా నిజం. ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌టన‌లు చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా క‌బ్జా చేయాల‌ని ఉంద‌న్న మాట‌ను చెప్పారు. కాకుంటే.. స‌ర‌దాగా. ఎంత స‌ర‌దా అయితే.. బాబు నోట క‌బ్జా మాట రావ‌టం ఆస‌క్తిక‌రంగా ఉంది. క‌బ్జా మాట బూతు కాన‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌స్తావించినఅంశం.. సంద‌ర్భాన్ని కౌంట్ లోకి తీసుకున్న‌ప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్య‌క్తి నోటి నుంచి రావాల్సిన మాట ఇది కాద‌న్న భావ‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంత‌కీ.. బాబు నోట క‌బ్జా చేయాల‌ని ఉంద‌న్న మాట ఎందుకొచ్చింద‌న్న విష‌యానికి వెళితే.. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో రూ.40 కోట్ల‌తో పోలీస్ హెడ్ క్వార్ట‌ర్ ను ఏర్పాటు చేశారు. అదేనండి..డీజీపీ కార్యాల‌యం. దీన్ని ముఖ్య‌మంత్రి బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు కాసింత స‌ర‌దాగా.. డీజీపీ కార్యాల‌యాన్ని చూస్తే.. క‌బ్జా చేయాల‌ని ఉంద‌ని.. తాను కానీ అలా చేస్తే ఎవ‌రూ మంచి ఆఫీస్ క‌ట్టుకోరంటూ చ‌మ‌త్క‌రించారు. మామూలుగా చూస్తే.. ఈ త‌ర‌హా వ్యాఖ్య ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి నుంచి ఎవ‌రూ ఆశించ‌రు.

కాకుంటే.. చంద్ర‌బాబు లాంటి ముఖ్య‌మంత్రి మ‌న‌సును దోచుకునేలా డీజీపీ భ‌వ‌న నిర్మాణం జ‌రిగినందుకు సంతోషించాలో.. లేక‌.. బాగున్న ప్ర‌తిది త‌న సొంతం అయితే బాగుండ‌న్న భావ‌న మ‌న‌సుకు క‌లిగే ముఖ్య‌మంత్రి తీరుకు బాధ ప‌డాలో అర్థం కాని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పోలీసుల మ‌న‌సుల్ని దోచుకునేలా మాత్రం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య ఒక‌టి చేశారు. ప్ర‌తి పోలీసుకూ ఇల్లు క‌ట్టించే బాధ్య‌త త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని చెప్ప‌టం ద్వారా.. ఏపీలోని పోలీసుల‌కు స‌రికొత్త హుషారు తీసుకొచ్చార‌ని చెప్పాలి. రాష్ట్రంలో పోలీసుల తీరు బాగుంద‌ని.. గుంటూరు జిల్లాలో బోరుబావిలో ప‌డిన చిన్నారిని కాప‌డిన ఎపిసోడ్‌ను ప్ర‌స్తావించిన సీఎం.. పోలీసుల్ని అభినందించారు.