Begin typing your search above and press return to search.

కోర్టు ఎపిసోడ్‌ కు బాబు స్క్రిప్ట్ ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:23 AM GMT
కోర్టు ఎపిసోడ్‌ కు బాబు స్క్రిప్ట్ ఇదేన‌ట‌!
X
రాజు స్వ‌యంగా యుద్ధం చేస్తాడా? త‌న బ‌ల‌గాల్ని మొహ‌రించి ప్ర‌త్య‌ర్థిని దెబ్బ తీస్తాడే కానీ.. త‌న‌కు తానుగా క‌త్తి.. డాలు ప‌ట్టుకొని యుద్ధ‌రంగంలోకి దిగేది చాలా త‌క్కువ‌. అందునా.. ప్ర‌జాస్వామ్య భార‌తంలో వ్యూహ‌ర‌చ‌న చేయ‌ట‌మే కాదు.. క్షేత్ర‌స్థాయికి వెళ్లి యుద్ధం చేయ‌టం ఉండ‌దు. ఆ చిన్న విష‌యాన్ని సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు ఏ మాత్రం అర్థం కావ‌టం లేద‌ని వాపోతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

ప్ర‌తి విష‌యంలోనూ మైలేజీని ఆశించే బాబుకు.. ఇప్పుడు బాబ్లీ ఇష్యూలో భారీ మైలేజీ పొందొచ్చ‌న్న ఆశ క‌లుగుతోంది. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి తెలంగాణ‌లో సానుభూతి సెంటిమెంట్‌ ను ర‌గ‌ల్చాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇందులో భాగంగా త‌న‌కు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ చేసిన ధ‌ర్మాబాద్ కోర్టుకు స్వ‌యంగా వెళ్లాల‌న్న‌ది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.

అయితే.. ఈ ప్లాన్ కు తెలుగు త‌మ్ముళ్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మీకు మీరుగా స్వ‌యంగా కోర్టుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది? కోర్టుకు హాజ‌రు కాకుండా న్యాయ‌ప‌రంగా పోరాటం చేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

దీనికి బాబు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌జ‌ల కోసం పోరాడాం.. కోర్టు ఎదుట‌కు వెళితే త‌ప్పేం లేద‌న్న మాట‌ను ఆయ‌న చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. కోర్టులో న్యాయ‌మూర్తి ఎదుట నిల‌బ‌డ‌తాన‌ని బాబు స్ప‌ష్టం చేయ‌గా.. తొంద‌ర‌ప‌డొద్ద‌ని.. ఆచితూచి నిర్ణ‌యం తీసుకుందామ‌ని సీనియ‌ర్ నేత‌లు బాబుకు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌వేళ బాబు కోరుకున్న‌ట్లుగా ధ‌ర్మాబాద్ కోర్టు ఎదుట ఏపీ సీఎం స్వ‌యంగా హాజ‌రు కావాల్సి వ‌స్తే.. అందుకు త‌గ్గ‌ట్లు భారీగా జ‌న‌సీమ‌క‌ర‌ణ‌ను చేప‌డ‌తామ‌న్న ఆలోచ‌న‌లో పార్టీ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కోర్టు ఎదుట బాబు స్వ‌యంగా హాజ‌రు కావ‌టం ఇబ్బందేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై బాబు అంతిమంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.