Begin typing your search above and press return to search.

బాబు.. యుఎన్ ఓనే ఏమార్చారు!

By:  Tupaki Desk   |   31 Aug 2018 4:15 AM GMT
బాబు.. యుఎన్ ఓనే ఏమార్చారు!
X
చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఇవి ఆయనకున్న పదవులు. ఇవి ఆయనకున్న హోదాలు. ఈ విషయం తెలుగు రాఫ్ట్రాల వారందరికి తెలుసు. అంతే కాదు... ఈ పదవుల్లోకి రావడానికి ఆయన పన్నిక పన్నాగాలు... ఎత్తులు.. జిత్తులు... మోసాలు... రాజకీయ చతురతలు అన్నీ తెలుగు వారికి పరిచితమే. అందుకే ఆన్ని పార్టీల వారు చంద్రబాబు నాయుడితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత - అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతే చంద్రబాబు జోరుకు కళ్లెం పడింది. అయినా ఆయన తన ఎత్తులు - జిత్తులు ఎక్కడో ఒక చోట ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడి వ్యూహాలకు కాలం చెల్లడంతో ఆయన తన ద్రష్టిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకువెళ్లారు. అంతే ఐక్య రాజ్య సమితి నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వ్యవసాయం దండగని... పనికిమాలినదని ప్రకటించిన చంద్రబాబు నాయుడ్ని వ్యవసాయరంగం గురించి ప్రసంగించాల్సిందిగా యుఎన్ఓ ఆహ్వానించింది.

సెప్టెంబర్ 24 తేదిన యుఎన్ ఓలో ప్రపంగించేందుకు చంద్రబాబు నాయుడు తన పరివారంతో కలిసి వెళ్లనున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడి చతురత కనిపిస్తుంది. ఎలాంటి రసాయనాలు - ఎరువులు వాడకుండా ప్రక్రతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు ఈ ఆహ్వానం అందుకున్నారు. ఇందుకోసం ఏటా 2500 కోట్లు బడ్జెట్‌ లో కేటాయించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ వ్యాసం వచ్చింది. ఈ వ్యాసమే చంద్రబాబు నాయుడికి యుఎన్ ఓ ఆహ్వానం అందేందుకు కారణమయ్యిందని ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు నాయుడు తన గొబెల్స్ ప్రచారాన్ని రాష్ట్రాలకే కాదు... జాతీయ స్ధాయికే కాదు... అంతర్జాతీయ స్ధాయికి కూడా వాడుకుంటున్నారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం.వీ.నాగిరెడ్డి విమర్శిస్తున్నారు. ఏడాదికి 2500 కోట్లు కేటాయించి 2024 సంవత్సరానికి రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో ప్రక్రతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేపట్టడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. గతంలో చంద్రబాబు నాయుడి వ్యవపాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుగు ప్రజలకు తెలుసునని - అలాంటిది ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయిలో ఆయనకు గుర్తింపు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అంతే కాదు... ఏకంగా యుఎన్ ఓనే చంద్రబాబు నాయుడు ఏమార్చేశారని అంటున్నారు.