Begin typing your search above and press return to search.
పుష్కర విషాదంపై చంద్రబాబు కంటతడి
By: Tupaki Desk | 14 July 2015 6:59 AM GMTరాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభించిన కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. తొక్కిసలాటలో 23 మృతిచెందిన సంఘటనపై ఆయన కదిలిపోయారు... కంటతడి పెట్టారు. మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
తొక్కిసలాటలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వమై వైద్యం చేయిస్తుందన్నారు. అంచనాలకు మించి భక్తులు పుష్కరఘాట్ కు తరలి రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఏ ఘాట్ వద్ద పుష్కర స్నానం చేసినా పుణ్యం వస్తుందని, భక్తులు ఇతర ఘాట్ లకు కూడా వెళ్లాలన్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత తాను కంట్రోల్ రూంలో కూర్చుని పరిస్థితిని చక్కదిద్దానని చంద్రబాబు తెలిపారు. భక్తులు కూడా ఒకే ఘాట్ వద్ద గుమికూడవద్దని ఆయన కోరారు. పుష్కరాలు 12 రోజులు జరుగుతాయన్నారు. తాను ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
పుష్కరాలకు వచ్చిన భక్తులంతా సంయమనం పాటించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి పొడవునా ఎక్కడైనా నదీస్నానం చేయొచ్చని... రాజమండ్రికే రావాలని... ఈ ఘాట్ కే రావాలని ఏమీ లేదని... ఎక్కడైనా గోదావరిలో స్నానం చేయొచ్చని సూచించారు. ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.