Begin typing your search above and press return to search.

టూ మచ్.. బాబును ఏడిపించిన నేత..

By:  Tupaki Desk   |   11 Oct 2019 7:55 AM GMT
టూ మచ్.. బాబును ఏడిపించిన నేత..
X
ఇదే మరీ.. అధినేత వద్ద మార్కులు కొట్టేందుకు అగ్రనేతలు కూడా ఉబలాటపడుతుంటారు. ఆయనను మేనిక్యులేట్ చేస్తారు.. తమపై దృష్టి మరల్చేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అధినేతనే ఎమోషన్ కు గురిచేస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చంద్రబాబునే ప్రభావితం చేసి ఆయనను ఎమోషన్ కు గురిచేశారట మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. విశాఖ వేదికగా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం.. వైసీపీ గెలవడంతో టీడీపీ శ్రేణులు .. చంద్రబాబు జీర్ణించుకోలేదు. అసలు టీడీపీని ఎందుకు ఇంత కసిగా ఓడించారనే విషయం.. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బోధపడలేదట.. ఓడాక జరిగిన పొలిట్ బ్యూట్ భేటీలో కూడా అయ్యన్న భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు జగన్ కే ఓటేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక గత ఆగస్లు నెలలో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పార్టీ అధినేత చంద్రబాబుతో అప్పట్లో విభేదించడం సంచలనమైంది. రెండు నెలలకే జగన్ సర్కారును విమర్శిస్తూ జనంలోకి వెళుతున్న చంద్రబాబు తీరును ఆయన తప్పుపట్టారు. సర్కారు తీరుతో జనం విసుగు చెందాకే జనంలో వెళ్దామని చంద్రబాబుకు సలహా ఇచ్చారు.

కట్ చేస్తే తాజాగా చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటన పెట్టుకున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఈ భేటికి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు కూడా హాజరయ్యాడు. ఈ సమావేశంలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించి జగన్ ను తూర్పారపట్టారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు..

అయితే ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈసారి మాత్రం ట్రైయిన్ రివర్స్ లా మారారు. రెండునెలల కింద జగన్ ను తిట్టవద్దని.. చంద్రబాబును తప్పుపట్టిన అయ్యన్న.. ఈసారి మాత్రం చంద్రబాబుపై ప్రేమ ఒలకబోసారు. ‘చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి అనొద్దని.. ముఖ్యమంత్రి అనాలంటూ ’ కార్యకర్తలను పిలుపునిచ్చారు. చంద్రబాబును ఓడించినందుకు తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని మాజీ మంత్రి తెలిపారు. చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ఆడవాళ్లు సైతం ఆవేదన చెందుతున్నారని అయ్యన్న వేదికపై ఎమోషన్ పంచ్ డైలాగులు పేల్చారు.

అయ్నన్న చంద్రబాబును ఫిదా చేసేందుకు రెండు నెలలకే మాట మార్చిన తీరు అక్కడున్న నేతలకు కూడా షాక్ కు గురిచేసింది. చంద్రబాబు మెప్పు కోసం అయ్యన్న వేసిన వేశాలు చూసి వేదికపైనున్న నేతలంతో లోలోపల ఘోల్లు మంటూ నవ్వు ఆపుకోగా.. చంద్రబాబు మాత్రం ఎమోషనల్ కు గురయ్యారట.. చంద్రబాబునే ఎమోషనల్ కు గురిచేసిన అయ్యన్న వేషాలు చూసి టీడీపీ నేతలే నోరెళ్లబెట్టారట..