Begin typing your search above and press return to search.

మ‌రో జంపింగ్ నేత‌కు ప‌ద‌విచ్చిన బాబు

By:  Tupaki Desk   |   10 July 2017 3:50 PM GMT
మ‌రో జంపింగ్ నేత‌కు ప‌ద‌విచ్చిన బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న తీరును మ‌రోసారి చాటుకున్నారు. పార్టీలో ఉన్న వారిని కాద‌ని.. జంప్ అయి పార్టీలోకి వ‌చ్చిన నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వైనం మ‌రోసారి వెల్ల‌డైంది. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ జెండా మోస్తున్న నేత‌కు షాకిచ్చి.. ప‌ద‌వుల కోసం ఉన్న పార్టీ నుంచి జంప్ అధికార పార్టీలోకి వ‌చ్చిన నేత‌కు ప‌ట్టం క‌ట్టిన వైనం విమ‌ర్శ‌ల‌కు గురి చేస్తోంది. స్వార్థ రాజ‌కీయాల కోసం ఇలాంటి నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటార‌ని బాబు తీరును త‌ప్పు ప‌డుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రు.. ఆయ‌న కుమారుడు న‌వీన్ కుమార్ (జెడ్పీటీసీ స‌భ్యుడిగా జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున ఎంపిక‌య్యారు)లు విప‌క్ష పార్టీ నుంచి ఏపీ అధికార పార్టీలోకి జంప్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఫిరాయింపుల స‌మ‌యంలో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా న‌వీన్‌ కు జెడ్పీ పీఠాన్ని క‌ట్ట‌బెట్టేందుకు వీలుగా.. పార్టీలో మొద‌ట్నించి ఉండి.. ప్ర‌స్తుతం జెడ్పీ ఛైర్మ‌న్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నామ‌న రాంబాబు చేత బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌ద‌వి నుంచి త‌ప్పించే ముందు పార్టీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌విని బ‌ల‌వంతంగా క‌ట్ట‌బెట్టిన అధినాయ‌క‌త్వం పుణ్య‌మా అని త‌న జెడ్పీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఫిరాయింపుల స‌మ‌యంలో కుదిరిన ఒప్పందం మేర‌కు జ్యోతుల నెహ్రు కుమారుడు న‌వీన్‌ కుమార్‌ ను జెడ్పీ తాత్కాలిక ఛైర్మ‌న్ గా నియ‌మిస్తూ తాజాగా జీవోను విడుద‌ల చేశారు. ఈ నెల 15న న‌వీన్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల్ని చేప‌డ‌తార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జ్యోతుల నెహ్రు కుమారుడికి జెడ్పీ పీఠాన్ని అప్ప‌జెప్ప‌టంపై సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితులుగా చెప్పే మంత్రి య‌న‌మ‌లతో పార్టీకి చెందిన పలువురు అసంతృప్తిగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. పార్టీని న‌మ్ముకున్న వారిని వ‌దిలేసి.. పార్టీని అమ్ముకొని వ‌చ్చిన వారికి ప‌ద‌వులు అప్ప‌గించ‌టం స‌రికాద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.