Begin typing your search above and press return to search.
అఖిల-బ్రహ్మానందరెడ్డిలకు పొగ పెడుతున్నట్లేనా?
By: Tupaki Desk | 6 Oct 2017 6:12 AM GMTఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగానే ఆయా నియోజకవర్గాల టీడీపీనేతలకు గ్రేడ్ లు ఇస్తున్నారు. ఈ నేపథ్యలోనే బుధవారం అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు - పార్టీ ఇన్ చార్జ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు - నేతల పనితీరు - సమస్యల పరిష్కారం వంటి అంశాల ఆధారంగా ఏ - బీ - సీ - డీ గ్రేడ్ లను ప్రకటించారు. ఇందులో కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలకు ఇచ్చిన గ్రేడులను చూసినవారంతా రాజకీయ లెక్కలు మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఉప ఎన్నికల సమయంలో నంద్యాలను భూతలస్వర్గం చేస్తామని చెప్పిన చంద్రబాబు.. మంత్రి అఖిల ప్రియ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ప్రశంసించారు కూడా. అంతేకాదు.. భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపిస్తే నంద్యాల రూపురేఖలు మార్చేస్తాడన్నంత రేంజిలో సినిమా చూపించారు. కానీ... ఆ ఎన్నికలు జరిగి ఎన్నాళ్లూ కాకముందే ర్యాంకుల్లో ఆ ఇద్దరి నియోజకవర్గాలను తీసిపడేశారు. నంద్యాలకు ఏకంగా డీ గ్రేడ్ ఇచ్చారు.
ఇక మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డకు చంద్రబాబు సీ గ్రేడ్ ఇచ్చారు. కర్నూలు - ఆదోని - డోన్ లకు మాత్రమే ఏ గ్రేడ్ ఇచ్చారు. తక్కువ గ్రేడ్ వచ్చిన వారికి చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారట. ఈ గ్రేడ్ లు నేతల పనితీరుకు అద్దంపడుతున్నాయని.. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద నంద్యాలకు చంద్రబాబు డీ గ్రేడ్ ఇవ్వడం కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో ఈ అన్నాచెల్లెళ్లలో ఎవరికో ఒకరికి టిక్కెట్ రాకపోవచ్చని.. అందుకు ఇప్పటి నుంచే ఈ రకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న అంచనాలూ కర్నూలు నేతల నుంచి వినిపిస్తున్నాయి.