Begin typing your search above and press return to search.
పరకాల ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి?
By: Tupaki Desk | 12 Jun 2017 5:43 AM GMTకేవలం ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉంటూ, పార్టీ సభ్యత్వం కూడా లేకుండా తెదేపా మహానాడులో ఆ పార్టీ తరఫున రాజకీయ తీర్మానాలు పెట్టిన పరకాల ప్రభాకర్ కు చంద్రబాబు బ్రహ్మాండమైన ఆఫర్ ఇవ్వబోతున్నారట. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీని చేయాలనుకుంటున్నారని సమాచారం.
బీజేపీతో పరకాలకు ఉన్న సంబంధాల నేపథ్యంలోనూ, పరకాల భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర క్యాబినెట్ లో ఉండడం, ఆమెతో చంద్రబాబుకు అనేక రాజకీయ అవసరాలు ఉండడం వల్ల పరకాలకు ఈ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు మీడియా సలహాదారు పదవి నుంచి పరకాలను సాగనంపేందుకు చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా ఆయనను సీఎం కార్యాలయం నుంచి బయటకు పంపడం, తన విదేశీ పర్యటనలకు రాకుండా చూసుకునేలా బాబు స్కెచ్ అని కొందరు చెబుతున్నారు. దీని ద్వారా పరకాల పాత్రను పరిమితం చేయాలని బాబు ఆలోచిస్తున్నారన్న వాదన కూడా వనిపిస్తోంది.
మరోవైపు పరకాలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న సమాచారం పొక్కడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన నేతలను పట్టించుకోకుండా మధ్యలో వచ్చిన ఇలాంటివారికి ఇవ్వడం ఏంటి అని లోలోన మండిపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా పరకాల ఎమ్మెల్సీగా వెళ్లిపోతే ఆయన ప్లేసులోకి రావాలని ప్రయత్నిస్తున్నవారు కూడా తక్కువేమీ కాదు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. పరకాల వదిలి వెళ్లబోయే ప్లేసుకు గట్టి పోటీయే ఉంది. అయితే ఇప్పటికే ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయం అయిపోయిందని... ఈనాడులో కీలక పదవిలో ఉన్న కృష్ణాజిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఆ పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, పలువురు మంత్రులతో ఆయనకు ఉన్న పరిచయాలు... పాత్రికేయ అనుభవం... ఇప్పటికీ చంద్రబాబు ఇంటర్వ్యూలు చేయడానికి ఆయన వెళ్తుండడం వంటివన్నీ ఆయనకు కలిసి రానున్నాయని తెలుస్తోంది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/