Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా మారిన బాబు ‘సీల్డ్ కవర్’
By: Tupaki Desk | 7 Oct 2016 7:22 AM GMTహైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపించే విధానంలోనే కాదు.. పార్టీని.. పార్టీ నేతల్ని ఆయన డీల్ చేసే విధానం మిగిలిన రాజకీయ అధినేతల తీరుకు భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. పార్టీని బలోపేతం చేయటానికి ఆయన అనుక్షణం ఆలోచిస్తుంటారు. ఇందుకోసం కొత్త కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తుంటారు. మారిన రాజకీయాల్లో తరచూ తమ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయంపై సర్వేలు చేయించటం మామూలుగా మారింది.
అయితే.. ఇదే అంశంలో ఏపీ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి.. పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేల పని తీరు.. వారి తప్పొప్పులను వారికి అర్థమయ్యేలా చేయటం కోసం తరచూ ఆయన సర్వేలు జరిపించటం.. ర్యాంకులు సిద్ధం చేయించటం లాంటివి చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ర్యాంకులను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మీడియాలో వీటికి సంబంధించిన వివరాలు చాలానే వచ్చేశాయి.
ఈసారి ర్యాంకులు కాకుండా.. ఏకంగా నివేదికల్ని తయారు చేయించిన చంద్రబాబు.. తమ పార్టీ ప్రజాప్రతినిధులకు సీల్డ్ కవర్ లో అందించారు. విజయవాడకు సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన మేథోమధనం కార్యక్రమంలో భాగంగా.. ఆయన ఈ సీల్డ్ కవర్లు అందించారు. ఈ సందర్భంగా గుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడే ఆసక్తి ఉంటుందని.. తాను అందిస్తున్న సీల్డ్ కవర్లలోని అంశాల్ని ఎవరితోనూ పంచుకోరని తాను ఆశిస్తున్నట్లుగా చెప్పారు
దీంతో.. ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఇచ్చిన సీల్డ్ కవర్లో ఏముంది? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ ముఖ్యనేతల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యేలకు.. నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లకు గ్రేడింగ్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఎమ్మెల్సీలు.. ఎంపీలకు మాత్రం గ్రేడింగ్ లేకుండా కేవలం విశ్లేషణతో రిపోర్టులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి సంబంధించి 360 డిగ్రీల్లో వారు చేసే ప్రతి అంశాన్ని సదరు రిపోర్ట్ లో ప్రస్తావించటంతో పాటు.. వారు చేసే పనుల వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటన్న విషయాన్ని కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో వారెంత ఉత్సాహంగా ఉన్నారు? ప్రభుత్వంలో వారి భాగస్వామ్యం ఏమిటి? వారి మీదున్న ఆరోపణలు.. వారి పట్ల వారి నియోజకవర్గ ప్రజల ఫీడ్ బ్యాక్ లాంటివి ఉన్నట్లుగా తెలుస్తోంది. మీ కదలికల్ని పార్టీ అధినేత నిశితంగా గమనిస్తుంటారు. మీకు సంబంధించిన అన్ని విషయాలు అధినేతకు తెలుసంటూ తరచూ చెప్పే చినబాబు లోకేశ్ మాటలకు తగ్గట్లే తాజా సీల్డ్ కవర్ నివేదికలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నివేదికలు తమ్ముళ్లకు షాకింగ్ గా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదెంత నిజమన్నది రానున్న రోజుల్లో తెలుగు తమ్ముళ్లు తీరు చెప్పకనే చెప్పేస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/