Begin typing your search above and press return to search.
పోలీసులకే వార్నింగ్ ఇచ్చేసిన చంద్రబాబు
By: Tupaki Desk | 11 Oct 2019 6:44 AM GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా? అన్నట్లు మారింది ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరు. అధికారం చేజారిన ఫస్ట్రేషన్ బాబులో అంతకంతకూ పెరిగిపోతోన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. విపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షంలో ఉన్నప్పటి సానుకూల పరిస్థితులు ఉండవన్న విషయాన్ని బాబు మిస్ అవుతున్నట్లున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల చేత ఏ రీతిలో అయితే పనులు చేయించుకున్నారో.. ఇప్పుడు అదే రీతిలో పాలకపక్షం పనులు చేయించుకుంటుందన్నది మర్చిపోకూడదు.
అన్నింటికి మించి మిగిలిన వ్యవస్థలతో పోలిస్తే పోలీసుల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. విషయం ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి విధేయులుగా వ్యవహరించటం వారికి అలవాటే. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా.. మీకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నాం.. మీకు న్యాయంగా అనిపించింది మాత్రమే చేయండి.. మేం మీ విధుల్లో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పి.. చేతల్లోనూ అదే తీరును ప్రదర్శించిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఎప్పుడు ఎక్కడా లేదనే చెప్పాలి.
నిత్యం శ్రీరంగనీతులు వల్లించే బాబు జమానాలో ఇలా జరగకపోగా..వారిని అదే పనిగా వేధించిన తీరును మర్చిపోలేం. చేయాల్సినవన్నీ చేసి.. విపక్ష నేతగా ఉన్న కాలంలో పోలీసులకు నేరుగా హెచ్చరికలు చేయటం చూస్తే.. బాబుగారు.. మీకేమైందన్న సందేహం కలుగక మానదు.
రెండు రోజుల తన విశాఖ పర్యటన సందర్భంలో ఆయన పోలీసులు యంత్రాంగం మీద తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసుల్ని తాను గుర్తు పెట్టుకుంటానని.. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ప్రతి ఒక్కరి జాతకాలు తెలుసని.. తమాషాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన మండిపడ్డారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో పోలీసు వ్యవస్థను బాబు ఎలా వినియోగించుకున్నది తెలిసిందే. అలాంటి బాబు.. మళ్లీ మా మీద ఫైర్ కావటమా? మా మీద పార్టీ ముద్ర వేయటమా? అంటూ సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. బాబు హెచ్చరికలు గీత దాటిన రీతిలో ఉన్నాయన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. బాధ్యత కలిగిన ఒక విపక్ష నేత.. పోలీసుల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహాంతో ప్రశ్నిస్తున్నారు కొందరు అధికారులు.
విశాఖలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పోలీసులు..మీ సంగతి చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధ పడతారు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమని ఎద్దేవా చేయటం ఏమిటి? గడిచినఐదేళ్లుగా మేం తెలుగుదేశం పార్టీలో ఉన్నామా? అంటూ పలువురు అధికారులు ఫైర్ అవుతున్నారు.
ప్రభుత్వానికి తగ్గట్లు పోలీసులు వ్యవహరించటం అనాదిగా వస్తున్నదే. అలాంటప్పుడు ఆ విషయాన్ని అదే పనిగా తప్పు పడుతూ.. తిట్టిపోయటం మానేస్తే బాబుకు మంచిందంటున్నారు. తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తున్న బాబు తీరు ఏ మాత్రం బాగోలేదన్న మాట పలువురు పోలీసుల నుంచి వస్తోంది. చూస్తుంటే.. పోలీసులు తన మొదటి శత్రువులు అన్న ధోరణి బాబుకు అంత మంచిది కాదన్నది ఆయన ఎందుకు మర్చిపోతున్నట్లు?