Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు చంద్ర‌బాబు అగ్నిప‌రీక్ష‌!

By:  Tupaki Desk   |   4 Oct 2016 11:34 AM GMT
లోకేష్‌ కు చంద్ర‌బాబు అగ్నిప‌రీక్ష‌!
X
త‌న త‌న‌యుడు - టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ బాబుకు సీఎం చంద్ర‌బాబు అగ్నిప‌రీక్ష పెట్ట‌బోతున్నారా? త‌్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బాధ్య‌త‌ను లోకేష్ భుజాల‌పై పెట్ట‌నున్నారా? 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపును న‌ల్లేరుపై న‌డ‌క చేయాల‌ని భావిస్తున్నారా? ప‌క్కా ప్ర‌ణాళిక‌తో - ప‌క‌డ్బందీగా మునిసిపాలిటీల‌ను బుట్ట‌లో వేసుకోవాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ సిద్ధం చేశారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై ఓ క్లారిటీకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రెండోసారి కూడా అధికారాన్ని నిల‌బెట్టుకోవాలంటే.. ఖ‌చ్చితంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచితీరాల‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రెండేళ్ల టీడీపీ పాల‌న‌ - ప్ర‌జాభిప్రాయం - స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి వంటి ప‌లు అంశాల‌పై ఇంటిలిజెన్స్ స‌ర్వే తెప్పించుకున్నారు. ఇందులో ఆయ‌న కొన్ని చేదు వాస్త‌వాలు ఉండే స‌రికి ఉలిక్కి ప‌డ్డార‌ని స‌మాచారం. దీంతో మ‌రింత ప‌టిష్టంగా స్థానిక సంస్థ ల ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డాల‌ని శ్రేణుల‌కు పిలుపునిచ్చార‌ట‌. ఈ క్ర‌మంలో అటు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు - జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి లోకేష్‌ ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. రాయలసీమపై నిర్లక్ష్యం - ప్రత్యేకహోదాపై రాజీ అంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌గిన విధంగా జ‌వాబివ్వాల‌ని ఆ వ్య‌తిర‌క‌త ఎన్నిక‌ల‌పై ప‌డ‌కుండా చూడాల‌ని బాబు యోచిస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఆయన నేరుగా మునిసిపల్‌ ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని సూచించారు. మొదట డిసెంబర్‌ లో ఎన్నికలను నిర్వహించాలని భావించినప్పటికీ... జనవరి 20 తర్వాత బాగుంటుందని మంత్రులు - నేతలు సూచించడంతో చంద్రబాబు అందుకు అంగీకరించిన‌ట్టు తెలిసింది. ఎన్నికలు జరిగే నగరపాలక సంస్థలు - మునిసిపాలిటీలను ప్రత్యేక దృష్టితో చూడాలని ఇప్పటికే చంద్రబాబునాయుడు జిల్లా మంత్రులు - ఇన్‌ ఛార్జ్ మంత్రులను ఆదేశించారు.అదే స‌మ‌యంలో అంద‌రినీ ఏక‌తాటిపై న‌డిపించి - మునిసిపోల్స్‌ లో స‌త్తా చాటాల‌ని లోకేష్‌ కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది.

మ‌రోప‌క్క‌ - ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ను కూడా చంద్ర‌బాబు వాయిదాల మీద వాయిదాలు వయ‌డానికి కూడా ఈ ఎన్నిక‌లే కార‌ణంగా బ‌హిరంగంగానే తెలుస్తోంది. మునిసిపోల్స్‌లో స‌త్తా చాటిన వారికి కేబినెట్‌లో బెర్త్ ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. ఇక‌, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. నిజంగా ఇది ఆయ‌న‌కి అగ్నిప‌రీక్షే! గ‌త రెండేళ్ల‌లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత ఉంద‌నేది విప‌క్ష వాద‌న‌. కాపుల రిజ‌ర్వేష‌న్‌ - ప్ర‌త్యేక హోదా - సీమ అభివృద్ధి - రైతు రుణాలు వంటి ప్ర‌ధాన అంశాల‌పై టీడీపీ విఫ‌ల‌మైంద‌ని జ‌గ‌న్ ప‌లుమార్లు విమ‌ర్శించారు కూడా ఈ నేప‌థ్యంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను లోకేష్‌ కి అప్ప‌గించ‌నుండ‌డం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/