Begin typing your search above and press return to search.
అందులో బాబును మించిపోయిన దేవాన్ష్
By: Tupaki Desk | 2 Aug 2017 4:27 AM GMTహైటెక్ ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. టెక్నాలజీని ఫింగర్స్ తో ఆటాడుకుంటారని.. ఈ-సీఎంగా ఆయన గురించి తెలుగు తమ్ముళ్లు తెగ చెప్పేసుకుంటారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. తన గొప్పతనం గురించి ఎలాంటి మొహమాటం లేకుండా తనకు తానే పొగిడేసుకోవటం కనిపిస్తుంది.
టెక్నాలజీ సీఎంగా.. హైటెక్ ముఖ్యమంత్రిగా పలు పేర్లతో పొగిడించుకునే చంద్రబాబు.. తాజాగా ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని వాడేసే విషయంలో తనకంటే తన మనమడు మహా తోపుగా ఆయన అభివర్ణించారు. రెండేళ్లు కూడా నిండని తన మనమడు దేవాన్ష్.. అప్పుడే స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నట్లుగా చెప్పారు.
ఈ-ప్రగతి శిక్షణలో పాల్గొనే అధికారులు.. ఉద్యోగులు చరిత్ర సృషిస్తారని చెప్పే క్రమంతో తన మనమడి ముచ్చటను ప్రస్తావించారు చంద్రబాబు. తన కంటే తన మనమడు టెక్నాలజీ వినియోగించటంలో బెటర్ అని చెప్పిన ఆయన అందుకు ఉదాహరణ అన్నట్లుగా దేవాన్ష్ స్మార్ట్ ఫోన్ వినియోగం గురించి చెప్పుకొచ్చారు. తనకు అన్ని తెలుసని చెప్పుకునే చంద్రబాబుకు.. రెండేళ్లు కూడా నిండని చిన్నపిల్లాడి దగ్గరకు సెల్ ఫోన్లు లాంటి కాలుష్యకారక వస్తువులు చేరకుండా ఉండాలన్న జాగ్రత్తల్ని ఎందుకు తీసుకోనట్లు?
వ్యాపార విషయాల్లో ఈ మధ్యన బాగా బిజీ అయిపోయిన దేవాన్ష్ తల్లి బ్రాహ్మణి.. తన కొడుకు స్మార్ట్ ఫోన్ వినియోగం మీద ఒక కన్నేసి ఉంచితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. నిండా రెండేళ్లు లేని తన మనమడి సెల్ ఫోన్ వినియోగం గురించి బాబు లాంటి అధినేత గొప్పగా చెబితే.. వాటిని తమ పిల్లలకు ఇచ్చేసేలా చాలామంది పేరెంట్స్ మీద ఈ మాటల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.