Begin typing your search above and press return to search.
బాబుకు కష్టమేనట!?
By: Tupaki Desk | 1 Nov 2018 5:56 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు పార్టీ నుంచి వచ్చిన సర్వేలు కాని - ఇంటెలిజెన్సీ నుంచి వచ్చిన సర్వేలు కాని - స్వకులం వారి సర్వేలు కాని అనుకూలంగా లేవని తాజా నివేదికలను బట్టి తెలుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురుదెబ్డే తగిలిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను కూడా రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజల నుంచి ఎదురు దెబ్బే తగులుతోందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి క్యాంటిన్ లో పని చేస్తున్న వ్యక్తి దాడి చేసే దాన్ని ప్రతిపక్షం పైనే వేయాలనుకోవడం కూడా ప్రజలకు నచ్చలేదని అంటున్నారు. పోలీసుల దర్యాప్తులో వచ్చిన వివరాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోలీసు పెద్దలు వివరిస్తున్నారని సమాచారం. ఈ నివేదికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికే మచ్చ తెచ్చే విధంగా వాస్తవాలున్నాయంటున్నారు. ఇందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ఆయన పార్టీ నాయకులు వివిధ సభల్లోనూ - చర్చా వేదికల్లోనూ పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు.
పాదయాత్ర సందర్భంగా చాలా సందర్భాలలో ప్రతిపక్ష నేత చేసిన ప్రసంగాలు - అసాధ్యాలను సుసాధ్యం చేస్తామంటూ ప్రకటించకపోవడంతో ఆయన మాటలకు ఆంధ్రప్రదేశ్ లో నానాటికి విలువ పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా విలువ పెరిగిందంటున్నారు. "జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో పరిణితి చెందినవి. ఆయన పోలీసులపైనే నమ్మకం లేదన్నారు కాని.... పోలీసు వ్యవస్ధపై అనలేదు. అంటే దీనర్ధం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ వ్యవస్ధకు అనుగుణంగా కాకుండా ఓ వ్యక్తికి అనుగుణంగా పని చేస్తున్నారని తేలిపోయింది " అని సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా స్పష్టమైందని - అందుకే అన్ని జిల్లాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలు చంద్రబాబు నాయుడికి కష్ట కాలంగానే పరిగణించాలని అంటున్నారు.