Begin typing your search above and press return to search.
బాబు కష్టాన్ని జాతీయ మీడియా గుర్తించిందోచ్
By: Tupaki Desk | 23 Aug 2016 7:37 AM GMTఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచటం.. అందులో భాగంగా తన పాలనపై జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పెంచుకునేలా చేసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆయన శ్రమిస్తున్న తీరు పలువురికి ఆశ్చర్యకరంగా ఉందనే చెప్పాలి. అదే పనిగా పుష్కర పనులపై దృష్టి పెట్టిన ఆయన.. కృష్ణా పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేశారన్న పేరును సంపాదించుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
పుష్కరాల్ని తామెంత పక్కా ప్లానింగ్ తో నిర్వహిస్తున్నామన్న విషయాన్ని జాతీయస్థాయిలో అందరికి అర్థమయ్యేలా చేయటం కోసం ఆయన ఢిల్లీ నుంచి జాతీయ మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా బెజవాడకు ఆహ్వానించటమే కాదు.. పుష్కరాల సందర్భంగా తాము అనుసరించిన విధానాల్ని చూడాలని కోరారు. ఆయన శ్రమ ఫలించి.. జాతీయ మీడియాలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పుష్కరాల మీద ప్రత్యేక కథనాలు రావటమే కాదు.. పుష్కరాల్లో ఛైల్డ్ ట్రేసింగ్ విధానం బాగుందన్న పాజిటివ్ స్టోరీలు రావటంపై బాబు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారట.
పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విధానాలపై సోషల్ మీడియాలో చక్కటి స్పందన వచ్చిందంటూ ఏపీప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చంద్రబాబుకు వివరించటంతో పాటు.. అందుకు సంబంధించిన గణాంకాల్ని చూపించారట. దీంతో ఖుషీ అయిన చంద్రబాబు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత పకడ్బందీగా.. పట్టుదలగా పుష్కర ఏర్పాట్లు చేయటం ఒక హిస్టరీ అని మురిసిపోయారట. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తున్నప్పుడు సంతోషం ఉండకుండా ఉంటుందా..?