Begin typing your search above and press return to search.
ఏపీకి సంపద కోసమే పర్యటించానంటున్న బాబు
By: Tupaki Desk | 13 May 2017 3:53 PM GMTఅమెరికా పర్యటన అనంతరం తొలిసారిగా సచివాలయనికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ప్రతి నిమిషాన్ని వినియోగించుకున్నామని చంద్రబాబు మీడియాతో తెలిపారు. తన జీవితంలో ఎన్నో దేశాలకు వెళ్లానని, ఈ పర్యటన ఇచ్చిన సంతృప్తి మరేదీ ఇవ్వలేదని బాబు వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న ఆలోచనకు అమెరికా పర్యటనలో పరిష్కారం దొరికిందని తెలిపారు. అమెరికా పర్యటనలో సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని బాబు పేర్కొన్నారు. భారత్ లో విద్యుత్ రంగాన్ని మార్చబోతున్నామని, దీని కోసం టెస్లా సంస్థను సంప్రదించామన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ర్టానిక్ వాహనాలు రాబోతున్నాయని చంద్రబాబు జోస్యం చెప్పారు.
విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే తన తపన అని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో రెండో దశ సంస్కరణలకు నాంది పలుకుతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో రాబోతుందని పేర్కొన్నారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశం కల్గుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధంగా సంస్కరణలు ఉండాలని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గించాలన్నదే తన ఆలోచన అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న ఆలోచనకు అమెరికా పర్యటనలో పరిష్కారం దొరికిందని చంద్రబాబు తెలిపారు. సౌర విద్యుత్ తయారీలో ధర తగ్గితే భారత్‌లో అనూహ్య మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించి వ్యవసాయం - విద్యుత్ - విద్య - వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. అన్ని వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లు తెలుగువాళ్లేనని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పంజాబ్ వాళ్లు వ్యవసాయం కోసం అమెరికా వెళ్లగా, మన వాళ్లు మాత్రం వృత్తి నిపుణులుగా అమెరికా వెళ్లారని చెప్పారు. ప్రపంచంలో తెలుగువాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలని చెప్పినట్లు వివరించారు. ప్రపంచంలో ప్రతి నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఒక భారతీయుడు ఉన్నాడని పేర్కొన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఐవోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ నాంది పలుకుతోందని బాబు విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/