Begin typing your search above and press return to search.
బాబుకు వాచీ లేని ఎఫెక్ట్ ఎంతంటే..
By: Tupaki Desk | 18 April 2017 3:34 AM GMTఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు.. జోకులకు అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఎందుకిలా అంటే.. ఆయన చెప్పే మాటలు.. చేసే పనులే అందుకు కారణంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద జోకులు ఎందుకు పెద్దగా పేలవంటే.. ఆయన మాటలు సూటిగా.. స్పష్టంగా ఉంటాయే తప్పించి.. తడవకో రకంగా ఉండవు. మాట్లాడే మాటలు కూడా పరిమితంగా ఉండటం కూడా దీనికి కారణం. ఇక.. విమర్శల విషయానికి వస్తే.. రాజకీయ రంగంలో ఉన్న వారికి మామూలే. కానీ.. బాబు మీద పేలినన్ని జోకులు మరెవరి మీదా పేలవన్న మాటను టీడీపీ నేతలే తరచూ ప్రస్తావించటం కనిపిస్తుంది.
తాజాగా ఒక కొత్త తరహా జోకు ఒకటి బాబు మీద పేలుతుందని చెబుతున్నారు. ఈవిషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొనటం గమనార్హం. మైకు కనిపిస్తే చాలు బాబు తనను తాను మర్చిపోతారని చెబుతుంటారు. టైమ్ మేనేజ్ మెంట్ విషయంలో బాబు చాలా పూర్ అని చెబుతుంటారు. పార్టీ సమావేశమైనా.. బహిరంగ సభ అయినా.. చివరకు అధికారులతో రివ్యూ మీటింగ్ అయినా సరే.. ఆయన అదే పనిగా మాట్లాడుతూ.. సహనానికి పరీక్ష పెడుతుంటారు.
అందుకే.. బాబు బహిరంగ సభకు ఉత్సాహంగా వచ్చే ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు.. తిరిగి వెళ్లే టైంలో మాత్రం ఒకింత నిరుత్సాహంతో వెళుతుంటారు. ఇక.. అధికారుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. టైం సెన్స్ అన్నది లేకుండా అదే పనిగా గంటల తరబడి మారధాన్ మాదిరి సాగటం కనిపిస్తుంటుంది. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ అలవాటు మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.
అధికారులతో భేటీ సందర్భంగా గంటల తరబడి చెప్పిందే చెప్పటం.. మధ్య మధ్యలో తాను పూర్వ రంగంలో ఏమేం సాధించానన్న విషయాన్ని చెప్పుకునే తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆయన మాటలు విసుగు పుట్టిస్తున్నాయని.. ఏం చేయాలో అర్థం కావటం లేదని అధికారులు వాపోతున్నారు. బాబుతో రివ్యూ మీటింగ్ అంటే చాలు.. భయపడిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన దివంగత నేతలు ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారు టైం అంటే టైం అన్నట్లుగా ఉండేదని.. వారి చేతికి వాచీ ఉండేదని.. అదెప్పుడూ హెచ్చరిస్తూ ఉండేదని చెబుతున్నారు.
బాబు చేతికి వాచీ లేకపోవటంతో ఆయన టైమ్ సెన్స్ అంతకంతకూ తగ్గిపోతుందంటూ అధికారులు చెబుతున్నారు. చేతికి వాచీ లేకపోవటంతో.. తానెంత సేపట్నించి మాట్లాడుతున్నది బాబుకు అర్థం కావటం లేదని.. అందుకే.. ఆయనకు వాచీ కొనిపెడితే బాగుంటుందన్న జోక్ పేలుస్తున్నారు. ఎందుకలా అంటే..బాబును వాచీ లేదేం అంటే.. తన దగ్గర డబ్బులు లేవని.. పేదవాడినని చెప్పిన మాటను ప్రస్తావిస్తూ.. ఆయనెటూ వాచీ కొనుక్కోలేరు.. కనీసం మనమైనా వాచీ కొనిపెడితే.. టైం తిప్పులు తీరతాయని జోకేస్తున్నారట అధికారులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/