Begin typing your search above and press return to search.
ఆ రకంగా పీవీ కి హెల్ప్ చేసింది చంద్రబాబేనంట!
By: Tupaki Desk | 27 Feb 2018 5:30 PM GMTపీవీ నరసింహారావు పెదవి విప్పి మాట్లాడే రకం కాదు. తన పని తాను చేసుకుపోయే వారు అంతే. చేసిన పనుల గురించి కూడా సొంత డబ్బా కొట్టుకునే అలవాటు ఆయనకు లేదు. ఇవాళ్టి పాలకుల మాదిరిగా.. గోరంత పనిచేస్తే కొండంత డబ్బా కొట్టుకునే కల్చర్ ఆరోజుల్లోనే ఉండేది కాదు. అసలు అందుకే పీవీ నరసింహారావును మౌనమునిగా అందరూ అభివర్ణిస్తుంటారు. ఆయన ఏమీ మాట్లాడని నేతే అయినా ఆయన చేసిన కృషికి ఈ దేశంలో ఇప్పటికీ ఆయన పేరిటే గుర్తింపు ఉంది.
గ్లోబలైజేషన్ అనే పదాన్ని భారతదేశానికి పరిచయం చేసింది.. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది.. ఐటీ విప్లవాన్ని భారత్ లోకి తీసుకు వచ్చింది పీవీ హయాంలోనే.. ఆ తర్వాతనే వేల లక్షల మంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకోవడమూ - విదేశీ సంస్థలు అనేకం భారత్ లో పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను సృష్టించడమూ.. వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రోజు అభివృద్ధిగా మన దేశంలో నిర్వచింపబడుతున్న దాదాపు ప్రతి విషయంలోనూ నాటి.. పీవీ కృషి అనివార్యంగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు.
అయితే ఇప్పుడు తాజాగా ఓ కొత్తసంగతి వినిపిస్తోంది. ‘పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి మీద దేశవ్యాప్తంగా ప్రజలకు చైతన్యం కలిగించిన ఘనత మాత్రమే తనదే’ అని చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నారు. ప్రధాని పివి నరసింహారావు ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టినా వాటిగురించి మాట్లాడేవారు కాదనేది చంద్రబాబు ఉవాచ. ఎందుకని తాను ప్రశ్నించినా మాట్లాడేందుకు విముఖంగా ఉండేవారని గుర్తుచేశారు. సంస్కరణలపై మాట్లాడటం ద్వారా ప్రజలను చైతన్యపరిచిందని - వాటికి ప్రజామోదం తెచ్చింది తానేనని ఇప్పుడు నలభయ్యేళ్ల రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు చెప్పుకుంటున్నారు.
గతంలో పార్టీలు సిద్ధాంతాల గురించే మాట్లాడేవంటూ వామపక్షాల కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి - నెహ్రూ సోషలిజం గురించి, ప్రస్తావించారు. మొత్తానికి ఇప్పుడు పార్టీలు సిద్ధాంతాల చర్చ మానేసి... స్వార్థ ప్రయోజనాల కోసమే కొట్టుకు పోతున్నట్లుగా చంద్రబాబునాయుడు ఒప్పుకుంటున్నట్లుగా ఉంది.
రాజకీయ సంస్కరణలు గోర్బచెవ్ తీసుకువచ్చారని - మావో - సేటుంగ్ ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించారని అంటూ సోవియట్ రష్యా 12ముక్కలుగా విడిపోగా చైనా పటిష్ట నిర్మాణంతో ఉన్న విషయం ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి ఈ విషయాలు అన్నిటినీ గుర్తుచేసుకుంటూ పార్టీ శ్రేణులకు హితబోధ చేయడం బాగానే ఉంది. ముక్కలుగా విడిపోవడం వలన రష్యా నాశనం అయిపోయిందని - ఐక్యంగా ఉండడం వల్ల చైనా బలంగా ఉన్నదని ఆయన చెప్పిన వ్యవహారం బాగానే ఉంది.
మరి ఈ అనుభవాన్ని - ఈ సిద్ధాంతాన్ని రాష్ట్రం విభజన గురించి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు.. చంద్రబాబునాయుడు బలంగా చెప్పలేకపోయారే - వ్యతిరేకించలేకపోయారే.. ఆరోజున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఉంటే గనుక.. 42 మంది ఎంపీలున్న రాష్ట్రంగా మనల్ని ఇలా చిన్నచూపు చూసే దమ్ము కేంద్రానికి మోడీ సర్కారుకు ఉండేదా అని పలువరు ప్రశ్నిస్తున్నారు.