Begin typing your search above and press return to search.
పవర్ బిజినెస్ లోకి బాబు ఫ్యామిలీ
By: Tupaki Desk | 1 April 2016 6:14 AM GMTఇప్పటివరకూ హెరిటేజ్ పేరు విన్న వెంటనే చంద్రబాబు ఫ్యామిలీ గుర్తుకు వచ్చేసే పరిస్థితి. ఏదో కందిపప్పు.. చింతపండు.. పాలు.. పెరుగు అమ్ముకున్నట్లు కనిపించినా.. చిల్లరకొట్టు వ్యాపారాన్ని భారీగా నిర్వహించటం.. లాభాల పట్టించటం అంత తేలికైన విషయం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం.. ఈ తరహా వ్యాపారంలో నష్టాలు చవిచూసే వేళ.. అందుకు భిన్నంగా కంపెనీ లాభాల బాట పట్టించటంలో బాబు ఫ్యామిలీ విజయవంతం అయ్యిందని చెప్పాలి.
తాజాగా హెరిటేజ్ బ్రాండ్ ను పవర్ బిజినెస్ లోకి దించే ప్రయత్నాన్ని బాబు ఫ్యామిలీ స్టార్ట్ చేసింది. పవన విద్యుత్ రంగంలో కాలు మోపనున్న విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఇందుకు అనంతపురం జిల్లాను ఎంపిక చేసుకుంది. 2.1 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్తును గోకుల్ డైరీ ఫ్లాంట్.. చిత్తూరు డైరీ ఫ్లాంట్లకు సరఫరా చేసుకునేలా ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. ఇందుకు ట్రాన్స్ కోతో ఒప్పందాలు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినహోతూరు గ్రామంలో ఈ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దేశీయంగా ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఈ ఫ్లాంట్ కు వినియోగించారు. మార్చి 27 నుంచి ఈ ఫ్లాంట్ పని చేయటం స్టార్ట్ చేసింది. ఇంతకాలం ఫుడ్స్ బిజినెస్ చేసిన బాబు ఫ్యామిలీ ఇకపై ‘‘పవర్’’ బిజినెస్ నిర్వహించనున్నారన్న మాట.