Begin typing your search above and press return to search.

బాబు నోట‌.. `ముంద‌స్తు` మాట‌!

By:  Tupaki Desk   |   21 Aug 2017 10:06 AM GMT
బాబు నోట‌.. `ముంద‌స్తు` మాట‌!
X
అవును!... ఏపీ సీఎంనారా చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల వెల్ల‌డించిన విష‌యం ప్ర‌కారం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయ‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఓ భారీ బ‌హిరంగ స‌భ‌లోనూ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 2014లో ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని - ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెనెక్కించార‌ని చెప్పారు. ఇప్ప‌టికి అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌య్యాయ‌న్నారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నికలో గెలిచే అభ్య‌ర్థి.. కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే ఉంటాడ‌ని అన్నారు.

అది కూడా కేంద్రం క‌నుక ఒకే దేశం.. ఒకేసారి ఎన్నిక‌లు అనే నినాదంతో ముందుకు వ‌స్తే.. 2019లో జ‌ర‌గాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రీ ముందుకు అంటే... 2018 డిసెంబ‌ర్‌ లోనే జ‌రుగుతాయ‌ని ఫ‌లితంగా ప్ర‌స్తుతం గెలిచే అభ్య‌ర్థి మ‌హా అయితే ఏడాది మాత్ర‌మే ఎమ్మెల్యేగా ఉంటాడ‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. ఇక‌, ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు నంద్యాల వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించారు. త‌ల్లీదండ్రులు లేని పిల్ల‌ల‌కు పోటీగా నిల‌బ‌డ‌తాడా? ఇంత ప‌ద‌వీ వ్యామోహం ఉన్న మ‌నిషిని తాను చూడ‌లేద‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగానే కేవ‌లం రెండేళ్లో.. ఏడాదిన్న‌రో ఉన్న ప‌ద‌వి కోసం ఎందుకంత పోటీ అని త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్నారు. తాజాగా చంద్ర‌బాబు నోటి నుంచి కూడా ఇదే భావ‌న వ్య‌క్త‌మ‌య్యే వ్యాఖ్య‌లు రావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కాగా, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు నిర్వ‌హిస్తే.. త‌న‌కు లాభం ఉంటుంద‌ని బాబు అనుకుంటున్నారా? అని పెద్ద ఎత్తున ప్ర‌శ్న‌లు వినిస్తున్నాయి. అయితే, గ‌త అనుభ‌వాల‌ను బ‌ట్టి.. బాబు 2004లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గా చిత్తుగా ఓడిపోయారు. దీనిని బ‌ట్టి ఆయ‌న మ‌రి ముంద‌స్తుకు జై కొడ‌తారో లేదో చూడాలి.