Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంట‌ర్వ్యూతో బాబు హ‌ర్ట‌య్యాడ‌ట‌

By:  Tupaki Desk   |   19 Jan 2018 9:28 AM GMT
కేసీఆర్ ఇంట‌ర్వ్యూతో బాబు హ‌ర్ట‌య్యాడ‌ట‌
X
ఇండియాటుడే చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టిసారిగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన సౌత్ కాంక్లేవ్‌ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట‌ర్వ్యూతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ‌ర్ట‌య్యార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. ప్ర‌చారానికి తెగ ప్రాధాన్యం ఇచ్చే చంద్ర‌బాబు...అంత‌టి ప్ర‌ముఖ మీడియా సంస్థ...అందులోనూ తాను అభివృద్ధి చేసిన‌ హైదరాబాద్‌ లో కీల‌క కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ...త‌న‌ను కాకుండా జూనియ‌ర్ అయిన కేసీఆర్‌ ను ఇంట‌ర్వ్యూ చేసినందుకు బాబు ఫీల‌య్యారా? అనుకుంటున్నారా? కాదు. బాబు ఆవేద‌న‌కు కార‌ణం వేరే!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ లో పాల్గొన్న సంద‌ర్భంగా పొరుగున ఉన్న‌ ఏపీతో పోలికే లేదని తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ మాటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తీవ్రంగా బాధ క‌లిగించింద‌ట‌. జిల్లా క‌లెక్ట‌ర్ల‌ స‌ద‌స్సులో ఈ విష‌యాన్ని చెప్తూ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒకింత ఉద్వేగానికి గుర‌య్యారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం మరో 35 వేల రూపాయలు పెరిగితేనే ఇతర రాష్ట్రాలతో సమానం అవుతామని అన్నారు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని - దీనికి కారణం ప్రజలు కాదు యూపీఏ చేసిన అన్యాయమని చంద్రబాబు చెప్పారు. పొరుగు రాష్ట్రాల కన్నా 20 నుంచి 25 శాతం వెనుకబడి ఉన్నామన్నారు. విభజన గాయం నుంచి కోలుకుంటున్నామనీ, అయితే ఇంకా గాయం మానలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రపాలకులు అన్యాయం చేశారనడం సరికాదన్నారు. 1995 కు ముందు తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే.. వాస్తవం బోధపడుతుందన్నారు. రాష్ట్రం ఎదిగే వరకూ కేంద్రం చేయూతనివ్వాల్సిందేనని, ఈ విషయంలో రాజీ లేదని, అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని ఆయన చెప్పారు. విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆ విషయంలో రాజీ పడే ప్రస‌క్తేలేదని - అవసరమైతే కోర్టుకు వెళతామని చంద్రబాబు చెప్పారు.

అయితే అనూహ్యంగా కోర్టు ప్ర‌స్తావ‌న తేవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అయిన త‌ర్వాత ఆయ‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని - న‌మ్మ‌క‌మే ముఖ్య‌మని వ్యాఖ్యానించిన సీఎం చంద్ర‌బాబు..ఇప్పుడు కోర్టు పేరును తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పైగా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పాటుప‌డుతున్నాన‌ని ప‌దే ప‌దే చెప్పే సీఎం చంద్ర‌బాబు దాదాపుగా మూడున్న‌రేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ఇంకా విభ‌జ‌న మంత్రాన్ని జ‌పించ‌డం ఏమిట‌ని ప‌లువురు స‌హ‌జంగానే విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.