Begin typing your search above and press return to search.
పీతల సుజాత... పార్టీ ధిక్కారం - బాబు డల్ !
By: Tupaki Desk | 20 March 2019 1:11 PM GMTఎన్నికలు వచ్చినపుడే... పార్టీపై నాయకుడి గ్రిప్ ఎంతో తెలుస్తుంది. అనేక మీటింగులు - సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత టిక్కెట్లు ప్రకటించినా కూడా టీడీపీలో అసమ్మతి పీక్స్ లో ఉంది. ఏకంగా చంద్రబాబునే లెక్కచేయడం లేదు పార్టీ నేతలు. తాజాగా చింతలపూడిలో బాబుకు తాజా షాక్ తగిలింది. బాబు సమావేశానికి మాజీ మంత్రి పీతల సుజాత డుమ్మా కొట్టారు. చింతలపూడి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న ఆమె ఆ సీటు దక్కకపోవడంతో అలకబూనారు. అది అధినేతకు తెలపడానికి ఈ మార్గం ఎంచుకున్నారు.
టిక్కెట్ దక్కని వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిరసన తెలుపుతున్నారు. కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తుంటే...ఇంకొందరు పార్టీలోనే ఉంటూ ఇలా అలుగుతున్నారు. ఇంకొందరు పార్టీకి రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఆమె వారం రోజులుగా పార్టీకి - పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు సభకు వస్తారేమో అనుకున్నారు. దానికి కూడా రాకపోయేసరికి ఆమె కోపం పీక్స్ లో ఉన్నట్టు అర్థమైంది.
2014 ఎన్నికల్లో పీతల సుజాత చింతలపూడి నుంచి గెలిచారు. ఆమెకు చంద్రబాబు చాలా కీలకమైన మంత్రి పదవి ఇచ్చారు. అయినా కూడా ఆమె నియోజకవర్గంలో బలపడలేకపోయారని భావించిన అధిష్టానం తొలుత మంత్రి పదవి తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఏకంగా టిక్కెట్టే క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా లేక ఇలాగే మౌనంగా ఉంటారో తెలియదు.