Begin typing your search above and press return to search.
పనైపోయింది...ఫిరాయింపుదారులకు బాబు మరో షాక్!
By: Tupaki Desk | 4 March 2017 10:43 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన పార్టీలోకి వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో పని అయిపోయిందని అనుకుంటున్నాడో ఏమో కానీ ఇప్పుడు వరస షాకులిస్తున్నాడు తెలుగుదేశం అధినేత. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో గవర్నర్ ను అడ్డం పెట్టుకుని బాబు గేమ్ మొదలుపెట్టాడు. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ ఇష్టపూర్వకంగా లేరని... మీడియాకు లీకులిచ్చేశారు. బాబు వ్యూహాత్మకంగానే ఈ పని చేశారని.. ఫిరాయింపుదారులు మళ్లీ నోరెత్తకుండా గవర్నర్ ద్వారా వారిని దెబ్బతీశాడనే మాట వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో.
మరి ఫిరాయింపు దారులైన ఎమ్మెల్యేల్లో కనీసం అరడజను మంది మంత్రి పదవుల మీద ఆశలతో వచ్చిన వారున్నారు. అలాంటి వారందరికీ బాబు మార్కు ఝలక్ తగిలింది ఇప్పటికే. మరి ఇది మాత్రమే కాదట... అంతర్గత వ్యవహారం ఒకదానిలో కూడా ఫిరాయింపుదారులకు బాబు ఝలకిచ్చాడనే మాట వినిపిస్తోందిప్పుడు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేసిన జిలానీలకు రకరకాల హామీలిచ్చాడు తెలుగుదేశాధినేత. వాటిల్లో మంత్రి పదవుల్లాంటివి గట్రా కాకుండా... మరిన్ని లాలూచీ వ్యవహారాలున్నాయి.
ఫిరాయింపుదారులను అలా బాగా టెంప్ట్ చేసిన వ్యవహారాల్లో ఒకటి కొత్త రాజధాని ప్రాంతంలో ఇస్తానన్న ఎకరం భూమి. వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరితే ఆ భూమి దక్కుతుందని ఎమ్మెల్యేలకు ఎరగా వేశారు. దీంతో ఫిరాయింపులకు అప్పట్లో గట్టి ఊపు వచ్చింది. మరి ఇప్పటికే ఫిరాయింపుల అంకం ఒక కొలక్కి వచ్చి ఏడాది కావొస్తోంది.
ఈ నేపథ్యంలో జంప్ జిలానీలు ఇప్పటికే బాబుగారిని తమకు ఇస్తామన్న ఎకరం భూమి విషయంలో పలుసార్లు సంప్రదించడం జరిగింది. అయితే.. బాబు నుంచి ఆ విషయంలో ఉలుకుపలుకు లేదు. చూద్దాంలే.. అన్నట్టుగా, దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నాడట చంద్రబాబు. దీంతో ఇప్పుడు ఫిరాయింపుదారులు ఇదేంటి? అని అంటున్నారు.
సీఆర్డీఏ పరిధిలో భూమి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ విషయంలో మోసం చేయడం ఏమిటి అని వారు వాపోతున్నారు. అయితే నిజాయితీగా ఓటు వేసిన ఓటర్లకు హామీల విషయంలోనే బాబుగారు మోసపూరిత వైఖరిని అనుసరిస్తున్నారు. మరలాంటిది.. ఫిరాయించిన వారికి ఝలకివ్వడంతో పెద్ద విశేషం కూడా లేదు. మరి బాబు గారి వరస దెబ్బలతో ఫిరాయింపుదారుల పరిస్థితి కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తయారైందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయిప్పుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/