Begin typing your search above and press return to search.

ఎన్జీటీ ఆదేశాలను తుంగ‌లో తొక్కిన బాబు!

By:  Tupaki Desk   |   13 July 2018 2:30 PM GMT
ఎన్జీటీ ఆదేశాలను తుంగ‌లో తొక్కిన బాబు!
X
పంచ‌భూతాల ముందు మాన‌వ మేధ‌స్సు దిగ‌దుడుపేన‌ని అనేక సార్లు రుజువైంది. ప్ర‌కృతి ప్ర‌కోపానికి జ‌న‌ప్ర‌భంజన‌మైనా తుడిచిపెట్టుకుపోవాల్సిందేన‌ని చ‌రిత్ర చెబుతోంది. ప్ర‌కృతికి విరుద్ధంగా మాన‌వులు అతి తెలివిని ప్ర‌ద‌ర్శిస్తే దాని ప్ర‌తాపానికి బ‌లి కావాల్సిందేన‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. 2013 జూన్ లో ఉత్త‌రాఖండ్ లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల్లో వేలాది మంది మృత్యువాత ప‌డ‌డం వంటి ఉదాహ‌ర‌ణ‌లు అనేకం. న‌దుల‌ను - నీటి ప్ర‌వాహ మార్గాల‌ను ఆక్ర‌మించుకొని వాటిపై నిర్మాణాలు - ఇళ్లు ఏర్పాటు చేసుకోవ‌డం వ‌ల్ల ఆ ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర‌హా నిర్మాణాలు ఏదో ఒక‌రోజు ఆ ప్ర‌వాహ ఉధృతిలో కొట్టుకుపోవ‌డం అనివార్యం. అటువంటి విషాద ఘ‌ట‌న‌లు చూసిన త‌ర్వాత కూడా ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరు ఏ మాత్రం మార‌లేద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఎంతో ముందు చూపుంద‌ని గ‌ప్పాలు కొట్టుకునే చంద్ర‌బాబు....ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని `అమ‌రావ‌తి`నిర్మాణం కోసం వాగులు - చెరువులు - వంక‌లు మూసేయ‌డం శోచ‌నీయం. భారీ వ‌ర్షాలు - వ‌ర‌ద‌లు వ‌స్తే....రాజ‌ధాని `అమ‌రావ‌తి`మునిగిపోతుంద‌ని నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యున‌ల్ - ప్ర‌జా సంఘాలు హెచ్చ‌రించినా బాబు పెడ‌చెవిన పెట్టారు. తుళ్లూరు ప్రాంతంలో ప్ర‌వ‌హిస్తోన్న కొండ‌వీడు - పాలవాగుల‌తో పాటు అనేక చెరువుల‌ను మూసేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో ....అక్క‌డి ప‌రిస్థితి గ‌మ‌నించిన బాబు....దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మూసివేసిన వాగుల‌ను కొద్ది మేర త‌వ్విస్తున్నారు.

చినుకు ప‌డితే చాలు న‌వ్యాంధ్ర రాజ‌ధాని ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. చిన్న‌పాటి వ‌ర్షానికే ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. రోడ్ల విస్త‌ర‌ణ‌ - అభివృద్ధి పేరుతో కొండ‌వీడు వాగు - పాల‌వాగుల‌తో పాటు 10 చెరువులను చంద్ర‌బాబు స‌ర్కార్ మూసివేసింది. దీంతో, భారీ వ‌ర్షాలు - వ‌ర‌ద‌ల స‌మ‌యంలో తుళ్లూరు - మంగ‌ళ‌గిరి - తాడేప‌ల్లి ల‌కు వ‌ర‌ద ముప్పు పొంచి ఉంది. గ‌ట్టివాన ప‌డితే కొండ‌వీడువాగు ...ఆ ఊర్ల‌ను ముంచుతుంది. ప్ర‌జా సంఘాలు - ప్ర‌జ‌లు ఈ విష‌యం చంద్ర‌బాబుకు చెప్పినా ప‌ట్టించుకోలేదు. వాగులు డిజైన్లు మార్చ‌వ‌ద్ద‌ని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కిన బాబు....3నెల‌ల క్రితం రోడ్ల నిర్మాణం పేరుతో ప‌లు చెరువులు మూసి వేశారు. అయితే, కొద్ది పాటి వ‌ర్షాల‌కే ఊర్లు జ‌ల‌మ‌య‌మ‌వుతున్నాయ‌ని - పూర్తిగా వాగుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం...చెరువులను మూయ‌డం వ‌ల్ల...భారీ వ‌ర్షాలు - వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఊర్ల‌కు ఊర్లు మునిగి పోతాయ‌ని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొండ‌వీడు - పాల‌వాగుల నామ‌రూపాలు లేవని....కృష్ణాన‌దిలోకి నీరుపోవ‌డానికి కాలువ‌లు మూసేశార‌ని వారు వాపోయారు. ప‌ది గ్రామాల మీదుగా పాల‌వాగు ప్ర‌వ‌హించి కృష్ణాన‌దిలో క‌లుస్తుందని - ఆ వాగును మూసి వేయ‌డం వ‌ల్ల ఆ ప‌ది గ్రామాలు మునిగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ త‌ప్పు తెలుసుకున్న ప్ర‌భుత్వం మ‌ళ్లీ 2 - 3 అడుగుల వెడ‌ల్పు వాగు తవ్విస్తున్నార‌ని అన్నారు. అడుసు తొక్క‌నేల‌....కాలు క‌డ‌గ‌నేల‌....అన్న రీతిలో బాబు వ్య‌వ‌హార‌ముందంటున్నారు. కానీ, గ‌తంలో ఉన్న విధంగా 40 అడుగులు త‌వ్వాల‌ని.... పూడ్చిన వాగుల‌తోపాటు చెరువులు తవ్వ‌క‌పోతే ప‌ది గ్రామాలు మున‌గ‌డం ఖాయమ‌ని చెబుతున్నారు. మ‌రి, స్థానికుల మాట‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకుంటారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.