Begin typing your search above and press return to search.
తెర పైకి సెక్షన్ 8... బాబు వ్యాఖ్యల మర్మమిదేనా?
By: Tupaki Desk | 3 March 2019 7:07 AM GMT``హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఇక్కడ సెక్షన్-8 అమలుచేయాల్సిందే. అది ఉంటే మా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటాం. మా ఉద్యోగులకు భద్రత ఉంటది. అది అమలు చేస్తేనే మాకు బావుంటుంది.`` గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన మరోమారు ఆచరణ రూపం దాల్చనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా టీడీపీ పెద్దలు - ఏపీ సర్కారు ఇదే రీతిలో ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఓటుకునోటు కేసు నమయంలో తెరమీదకు వచ్చిన ఈ కేసు మళ్లీ ప్రస్తావనకు వస్తున్నట్లు సమాచారం.
తాజాగా, తెలంగాణ పోలీసులు ఏపీకి చెందిన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమంటున్నారు. హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు చూస్తున్న ఓ ప్రైవేటు కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎలా దాడి చేస్తారని - డేటా ఎలా స్వాధీనం చేసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక ప్రైవేటు కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుందన్నారు. ఇక్కడ ఏదో జరుగుతోందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారాల్లో అక్కడి పోలీసుల జోక్యం చేసుకోవడాన్ని తాము తీవ్రంగా పరిగనిస్తున్నామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలి పెట్టబోనని - అందుకు బాధ్యులైన వారందరిపై కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహారాల్లో ప్రైవేటు కంపెనీ ఏదైనా చేస్తుందని అనుమానం వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప తెలంగాణలో ఫిర్యాదు చేయడం ఏమిటని ఆయన అన్నారు. అక్కడి పోలీసుల అండతో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వివరాలను తస్కరించి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండ చేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు.
కాగా, మరోమారు ఉమ్మడి రాజధానిలో భద్రత వంటి అంశాలను తెలుగుదేశం పార్టీ తెరమీదకు తీసుకురానుందని తెలుస్తోంది. ఈ రూపంలో ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 అమలు గురించి సైతం టీడీపీ శ్రేణులు ప్రస్తావించవచ్చని అంటున్నారు. తెలంగాణ పోలీసుల చర్యను బట్టి తదుపరి అడుగులు ఉంటాయని సమాచారం.