Begin typing your search above and press return to search.
బాబు మారాడు!... మనకు అవసరమా?
By: Tupaki Desk | 11 Jun 2018 2:30 PM GMTనారా చంద్రబాబునాయుడు... తొలుత గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నేతగానే రాజకీయ తెరంగేట్రం చేశారు. తొలిసారి కుర్రకారు హుషారుతో గట్టెక్కిన చంద్రబాబు ఆ మరుసటి ఎన్నికల్లోనే ఘోర పరాజయం చవిచూశారు. ఆ దెబ్బకు ఏకంగా తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని వదిలేసి ఎక్కడో మూడు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పం అయితే తనకు సేఫెస్ట్ ప్లేస్‌గా ఉంటుందని భావించి అక్కడికి దాదాపుగా పారిపోయినంత పనిచేశారు. అది కూడా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి, తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశంలో చేరిన తర్వాతే. ఇటు ఏపీ ఓటర్లతో పాటు అటు కర్ణాటక - తమిళనాడు ఓటర్ల కలగూర గంపగా ఉన్న కుప్పం నుంచి ఆయన గెలుస్తూనే వస్తున్నారు. మొత్తంగా తాను అనుకున్నట్లుగానే తనకు సేఫెస్ట్ డెస్టినేషన్ గా మారిన కుప్పంను మాత్రం బాబు వదలడం లేదు. సరే... ఇప్పుడు బాబు గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకన్న విషయానికి వస్తే... బాబు మారిపోయారు అన్న వాదన ఇప్పుడు బాగా వినిపిస్తోంది.
గతంలో రాజకీయాల కంటే కూడా అభివృద్ది - తాను అనుకున్న రంగాల్లో రాష్ట్రాన్ని ముందుంచాలన్న లక్ష్యంతో సాగిన చంద్రబాబు... ఇప్పుడు పాలిటిక్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రాధాన్యం ఎంతదాకా వెళ్లిందన్న విషయం ఇప్పుడిప్పుడే ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాల ద్వారా చాలా సుస్పష్టంగానే బయటపడుతోంది. ఆ విషయాలను ఓసారి పరిశీలించేందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రస్థానాన్ని ప్రస్తావించుకోవాల్సి వచ్చింది. 1995లో టీడీపీ వ్యవస్థాపకుడిగా ఉన్న తన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీతో పాటు అధికార దండాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు... సింగిల్ స్టెప్ తో ఏపీకి సీఎం అయిపోయారు. 1995 నుంచి 2004 దాకా ఏపీకి సీఎంగా పని చేశారు. ఈ క్రమంలోనే పాలనకు పెద్ద పీట వేసిన చంద్రబాబు.. సంస్కరణల సారథిగా - హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. తన పాలన ఎంతో బాగా ఉందంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు... తనను తాను సీఎంగా కాకుండా సీఈఓగా అభివర్ణించుకున్నారు.
ఆ తర్వాత ఓ ఐదారు నెలలు తక్కువ పదేళ్ల పాటు ఏపీకి సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. 20014లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అలిపిరిలో తనపై జరిగిన దాడిని చూపి సానుభూతి సంపాదించుకుందామన్న ఆయన ప్లాన్ వర్కవుట్ కాకపోగా... ఏకంగా పదేళ్ల పాటు విపక్ష స్థానంలో కూర్చోక తప్పలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ సాధించి పెట్టిన పదేళ్ల అధికారం గడువు ముగిసేలోగానే తెలుగు నేల రెండు ముక్కలైపోయింది. దీంతో నాడు 23 జిల్లాలతో కూడి ఉన్న ఏపీ ఆ తర్వాత 13 జిల్లాలకే పరిమితమైపోయింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అనుభవమున్న నేతగా తనను ప్రచారం చేసుకున్న బాబు... జనం మదిని కాస్తంతగా మార్చేసి సీఎం అయిపోయారు. ఇప్పుడు దక్కిన సీఎం పదవి కూడా మరో ఏడాదిలో ముగియనుంది. అయితే మరోమారు సీఎం కుర్చీని ఎక్కేందుకు ఉబలాటపడుతున్న చంద్రబాబు... అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలో సంస్కరణలను ఎప్పుడో గాలికి వదిలేసిన చంద్రబాబు... రాజకీయానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేయడం మొదలెట్టారు. అందులో భాగంగానే పథకం - ప్రకటన - పరిపాలన... అంశం ఏదైనా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ముందుగా పెద్ద విభేదాలు లేవు. కానీ ఎన్నికల గడువు దగ్గర కొచ్చేసరికి రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. బీజేపీని పక్కనపెట్టిన చంద్రబాబు... స్పెషల్ స్టేటస్ అంశాన్ని పొలిటికల్ టూల్ గా మార్చేసుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే... చంద్రబాబు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ ఓట్ల లెక్కలకే పెద్దపీటగా చెప్పుకోవాలి. సంస్కరణలను పక్కనపెట్టేసి సంక్షేమం పేరిట నిధులను పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. విపరీతంగా అప్పులు దూసి తెస్తున్నారని విపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్ట గలిగితే చాలు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారినా పర్వాలేదనే ఉదాసీన ధోరణి చంద్రబాబులో నెలకొందని సొంత పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఈ తరహా పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ప్రభుత్వాలపైన, వచ్చే తరాలపైన భారం పడే నిర్ణయాలైనా చంద్రబాబు వెనుకాడటం లేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న తెలంగాణతో పోల్చుకుంటూ ఉద్యోగుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ దూకుడు చూపుతున్నారన్న వాదనా లేకపోలేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి దిగజారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా... పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మరో ఏడాదిలో ఉన్నికలు జరగనుండగా... ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా చంద్రబాబు దుబారా స్పీడు తగ్గిస్తారా? అంటే అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మారిన చంద్రబాబు... మనకు అవసరమా? అన్న భావన ఇప్పుడు జనంలో బాగానే వినిపిస్తోంది. ఇదే భావన మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా జోరందుకున్నాయి. మొత్తంగా మారిన బాబు... తన పుట్టిని తానే ముంచేసుకుంటారా? అన్న కోణంలో ఇప్పుడు సరికొత్త విశ్లేషణలు హల్ చల్ చేస్తున్నాయి.