Begin typing your search above and press return to search.
బాబుకు పిచ్చిపట్టిందో లేదో పాఠకులే చెప్పేయొచ్చు!
By: Tupaki Desk | 23 Dec 2018 11:37 AM GMTచంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వైసీపీ అధినేత జగన్ అనడంతో టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. జగన్ ఈ స్థాయిలో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఉందంటున్నారు గత కొద్దికాలంగా చంద్రబాబు మాటలను పరిశీలిస్తున్న విశ్లేషకులు - నేతలు.
చంద్రబాబు చేసిందానికంటే ఎక్కువ చెప్పుకోవడం.. అసాధ్యాలను కూడా సాధించేస్తానని చెబుతూ జనాలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని... అందుకే జగన్ అలా అన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు సముద్రాన్ని జయించేశానని చెప్పారని... అది పిచ్చికి పరాకాష్ఠ కాకపోతే ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో కరువును తరిమేశానని చెప్పడం.. అదేసమయంలో 400 మండలాలు కరువుతో అల్లాడుతున్నట్లు కేంద్రానికి నివేదిక పంపడాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. దోమలతో యుద్ధానికి వెళ్లడం... ఇస్త్రో - వాతావరణ శాఖల కంటే తమ ఆర్టీజీఎస్ కచ్చితమైనదని చెప్పడం.. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఓడిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలకే తాను మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పడం వంటివన్నీ చంద్రబాబుకు పిచ్చిపట్టిందనడానికి ఉదాహరణలని అంటున్నారు.
కొద్దికాలంగా ఇవన్నీ చూడడం వల్లే జగన్ ఆ మాట అన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా నిన్న జగన్ ఈ వ్యాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన పాదయాత్రకు లక్షలాది మంది జనాలు తరలిరావడం విశేషం.