Begin typing your search above and press return to search.

మాన‌సిక క్షోభ‌!... బాబుకు ఊత‌ప‌ద‌మైందే!

By:  Tupaki Desk   |   8 March 2019 1:30 AM GMT
మాన‌సిక క్షోభ‌!... బాబుకు ఊత‌ప‌ద‌మైందే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... కొన్ని సెలెక్టెడ్ ప‌దాల‌ను నిత్యం వాడుతూనే ఉంటారు. విష‌యం ఏదైనా స‌ద‌రు ప‌దాలు ఆయ‌న నోట వెంట వినిపిస్తూనే ఉంటాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో సీఎంగా ప‌నిచేసిన స‌మ‌యంలో *వాట్ ఐ యామ్ సేయింగ్‌* అనే ప‌దాన్ని ప‌దే ప‌దే వాడేసిన చంద్ర‌బాబు... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత - బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత *కేంద్రం అన్యాయం చేసింది* - *సాధించే దాకా వ‌దిలిపెట్ట‌ను* - * అంతు చూసే దాకా వ‌దిలిపెట్ట‌ను*... ఇలా చాలా ప‌దాల‌ను ప‌దే ప‌దే వాడేస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపించిన నేప‌థ్యంలో *న‌న్నేమీ చేయ‌లేరు* అంటూ ఒకింత రీసౌండ్ డైలాగ్‌ ను అల‌వాటు చేసుకున్నారు.

ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ఓ కొత్త ప‌దాన్ని త‌న ప‌దంగా మార్చేసుకున్న చంద్ర‌బాబు... డేటా చోరీ కేసు ఎంట్రీ ఇవ్వ‌గానే... మ‌రో కొత్త ప‌దాన్ని ఊత‌ప‌దంగా చేసుకున్నారు. ఆ ప‌దం ఏమిటంటే... మాన‌సిక క్షోభ‌. విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఈ ప‌దాన్ని ఇక‌పై చంద్ర‌బాబు ప‌దే ప‌దే వాడ‌తార‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పొచ్చు. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభవం అంటూ మొన్న‌టిదాకా ఊద‌ర‌గొట్టిన నోటితోనే చంద్ర‌బాబు... ఇప్పుడు మాన‌సిక క్షోభ ప‌దాన్ని ప‌లికేందుకు సిద్ధ‌మైపోయారు. నేటి మ‌ధ్యాహ్నం అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలోనే ఆయ‌న ప‌దాన్ని ప‌ల‌క‌డం మొద‌లెట్టేశారు. ఇక ఎన్నిక‌లు ముగిసే దాకా - డేటా చోరీ కేసు తేలేదాకా చంద్ర‌బాబు నోట నుంచి ఈ మాట‌ను మ‌నం ప‌దే ప‌దే విన‌క త‌ప్ప‌దు.

ఇక ఈ ప‌దం వాడ‌కానికి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు... ఆ ప‌దాన్ని ఎలా వాడార‌న్న విష‌యాన్ని కూడా ఓ సారి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ ప‌దం ఆయ‌న నోట నుంచి ఇక‌పై వెల్లువ‌లా వినిపించే అవ‌కాశాలున్నాయి కాబ‌ట్టి. ఈ ప‌దాన్ని చంద్ర‌బాబు ఎలా - ఎన్ని సార్లు వాడార‌న్న విష‌యం చూస్తే... *చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ కనిపిస్తే చాలు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు* - *నాలుగేళ్ల నుంచి కష్టపడుతున్నాను.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు* - *నేను పద్ధతి ప్రకారం చేస్తున్నాను.. నామీద బురద జల్లుతున్నారు. ఎంత మానసిక క్షోభ ఉంటుందండి*... ఇలా చంద్ర‌బాబు త‌న డిక్ష‌న‌రీలో కొత్త‌గా చేర్చుకున్న ప‌దాన్ని ప‌దే ప‌దే వాడేశారు.