Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా.?

By:  Tupaki Desk   |   6 April 2019 1:30 AM GMT
చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా.?
X
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ప్రతీ క్షణం ఇప్పుడు చాలా కీలకం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మూడు రోజులే. అందుకే అటు టీడీపీ - ఇటు వైసీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే.. ఎన్నికల ప్రచారం పూర్తైన వెంటనే.. ఏ రోజుకారోజు లెక్కలు తెప్పించుకునే చంద్రబాబుకి.. తాను ఓడిపోతానన్న భయం రోజురోజుకి ఎక్కువైపోతున్నట్లు కన్పిస్తుంది. మొన్నటివరకు చాలా సాఫ్ట్‌ గా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తాను గెలిచేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా వెనకాడడం లేదు. అన్నింటికి మించి ఆయన మాటల్లో ఓటమి భయం చాలా స్పష్టంగా కన్పిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏపీలో డ్వాక్రా మహిళల ఓట్లు చాలా కీలకం. దాదాపు కోటి వరకు ఉంటారు డ్వాక్రా మహిళలు. ఈ ఓట్లు మొత్తం గంపగుత్తగా ఎవరికి పడితే.. వాళ్లు ముఖ్యమంత్రి అయినట్లే. అందుకోసమే.. ముందుస్తు వ్యూహంలో భాగంగా ఎన్నికల సమయానికి డ్వాక్రా మహిళల ఎక్కౌంట్‌ లో డబ్బులు పడేలా చంద్రబాబు ప్లాన్‌ చేశారు. కానీ బ్యాంకులకు వరుసగా సెలవలు రావడంతో అది వర్కవుట్ కాలేదనే భయం చంద్రబాబుకి వచ్చేసింది. దీంతో.. తాను ముఖ్యమంత్రి అయితే.. ఇకనుంచి పసుపు కుంకుమ పథకం ఇచ్చే సొమ్ము మూడుసార్లు కాదు ఐదు సార్లు ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు నిన్నటికి నిన్న.. పసుపు కుంకుమ డబ్బులు మీ అక్కౌంట్లలో పడితే.. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏం మాట్లాడినా దానికి ఒక లెక్క ఉంటుంది. అసలు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎలా ఉందో చంద్రబాబుకు తెలుసు. ఎలా చూసినా.. వైసీపీ గ్రాఫ్‌ రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా వెనుకాడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.