Begin typing your search above and press return to search.
సంక్రాంతి వేళ సొంతూర్లో బాబు అలా బిజీబిజీ
By: Tupaki Desk | 15 Jan 2017 2:45 PM GMTఆంధ్రులకు పెద్ద పండుగైన సంక్రాంతి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంతూరుకు వెళ్లటంతో అక్కడ పండగ సంబరాలు అంబరాన్ని తాకాయి. ముఖ్యమంత్రే స్వయంగా ఊరికి రావటమే కాదు.. అదే పనిగా ఉండటంతో ఊరు ఊరంతా ఒకటే హడావుడిగా మారిందని చెప్పాలి. చిత్తూరు జిల్లా నారావారి పల్లి చంద్రబాబు సొంతూరు.
ఏడాదిలో చాలా అరుదుగా మాత్రమే సొంతూరు వచ్చే చంద్రబాబు.. సంక్రాంతి పండగ వేళ మాత్రం సొంతూరులో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. సకుటుంబ సమేతంగా సొంతూరుకు వెళ్లిన చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రానికే స్వగ్రామానికి చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయం నుంచే ఆయనకుభారీ స్వాగతం లభించింది.
సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెకు నారా కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు రావటంతో పండగ కోలాహలం మరింత ఎక్కువైంది. ఇక.. బాబు మనమడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన.. తిరుపతి నుంచి నారావారిపల్లెకు చేరుకున్నారు.
సొంతూరుకు బాబు రావటానికి ముందే చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకొని భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో నారారోహిత్ కూడా సందడి చేశారు. చంద్రగిరిలోని అంబికా థియేటర్ లో బాలయ్య నటించిన శాతకర్ణిసినిమాను అభిమానులతో చూశారు. అనంతరం థియేటర్లో విజయోత్సవ కేకును కట్ చేశారు.
ఇక.. నారావారి పల్లెలో ఉన్న చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. గ్రామస్తుల పలకరింపుతో పాటు.. బంధు.. మిత్రులతో ఆయన క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. గ్రామస్తులకు నగదు రహిత లావాదేవీలపై గ్రామస్తులకు అవగాహన కల్పించటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టారు. నారావారి పల్లెలో ఆంధ్రా బ్యాంకు ఏటీఎంను ప్రారంభించారు. పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సొంతూళ్లో రెండు రోజులు గడిపిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/