Begin typing your search above and press return to search.
ఎక్కడేం జరిగినా.. టార్గెట్ బాబేనట మరి.?
By: Tupaki Desk | 30 Sep 2018 6:44 AM GMTదేశంలో ఎవ్వరి మీద దాడులు జరిగినా.. ప్రపంచం బద్దలైనా.. అది బాబుకు చుట్టి.. అల్లి బిల్లి కథలు అల్లి.. ఆయనపై సానుభూతి వర్షం కురిపించడంలో ఎప్పటి నుంచో ‘పచ్చ’ మీడియా ముందుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. కారణమేదైనా సరే.. బాబును కాపాడాలన్న ధృడ నిశ్చయం ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలో వ్యక్తమవుతోంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యతిరేకంగా ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని బాబుకు అంటగడుతూ.. ఆయనపై సానుభూతి వచ్చే పథకాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు..
తాజాగా ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిపై ఓ లాయర్ అక్రమాస్తులు బాగా సంపాదించినట్టు ఫిర్యాదు చేశాడు. దానిపై ఐటీ - ఈడీ సంస్థలు రంగంలోకి దిగి ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించి విచారిస్తున్నాయి. ఇది ఆయన సొంత వ్యక్తిగత వ్యవహారం. పైగా అక్రమాస్తుల కేసు. దీన్ని ఇప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి పాత కేసు ‘ఓటుకు నోటు’ను ముందుకు తెచ్చి చంద్రబాబుపై మోడీ ప్రతీకారం తీర్చుకోబోతున్నాడని.. అందుకే ముందస్తుగా రేవంత్ ను లోపలేయలని స్కెచ్ గీసినట్టు ఈరోజు పచ్చ మీడియాలో అభూత కల్పనల వార్తలు ప్రసారం చేశారు.
విచిత్రమేంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ ను కులాల మధ్య పోరాటంగా కూడా అభివర్ణించారు. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గంపై అధికార వెలమ సామాజికవర్గం పైచేయి సాధించడానికి ఈ ప్లాన్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిజానికి కేసులు - కులాలకు సంబంధమే లేదు.. రేవంత్ రెడ్డి ఎక్కడో లూప్ హోల్స్ తో దొరికిపోవడమే ఆయన లోపం. అందుకే ఈ కేసులు - అరెస్ట్ లు. ఆయన ఎంత సంపాదించినా పకడ్బందీగా ఉండుంటే ఈ చిక్కులు వచ్చేవి కావు. దేశంలోని చాలా మంది బడా నేతలు కూడా చిక్కడు దొరకడు పాలసీలో అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ తప్పించుకుంటున్నారు. రేవంత్ మాత్రం అధికార పార్టీలతో ఢీకొంటున్నాడు. అంతే తేడా.. స్వతహాగానే అధికారంలో ఉన్న వాళ్లతో ఢీకొంటే ఇబ్బందులు తప్పవు. పైగా రాజకీయ కుట్రలో ఇప్పుడు రేవంత్ ఓ పావు. దాన్నుంచి కాంగ్రెస్ ను కొట్టాలనే పెద్ద స్కెచ్ ను అధికార పక్షాలు వేశాయనే ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రధాన ఆటలో అరటిపండుగా బాబు మారిపోయాడు. రేవంత్ అక్రమాస్తుల కేసు తనవైపు వస్తుందేమోనన్న అనుమానం రాగానే తన మీడియా రంగంలోకి దిగింది. పాపం బలిచేస్తున్నారని.. కథనాలు రాసేస్తున్నారు. బాబుపై ప్రతీకారానికి దిగకముందే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి ఇది రేవంత్ అక్రమాస్తుల కేసు.. బాబుకు ఏం సంబంధం లేదు. కానీ సంబంధం అంటగట్టి మరీ జనాల్లో బాబుకు సానుభూతి తెచ్చే ఈ కొత్త ఆట మొదలైంది. ముందస్తుగానే ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టే వ్యూహం. తప్పులు చేసి ఇప్పుడు బుక్కై పోతున్న వేళ.. ఈ మొసలి కన్నీరును ప్రజలందరూ గుర్తిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.