Begin typing your search above and press return to search.
ఏపీ సచివాలయం ఎంత రెఢీ అయిందంటే..?
By: Tupaki Desk | 25 April 2016 4:39 PM GMTఅంతా మాయబజార్ లా మారింది. ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న ప్లాన్ కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు రావటం.. అంతలోనే టెండర్లు ఫైనల్ చేయటం.. రెండు ప్రఖ్యాత కంపెనీలు నిర్మాణాలు పోటాపోటీగా మొదలు పెట్టేయటం తెలిసిందే. ఈ మధ్యనే శ్లాబులు వేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన వెంటనే.. తాజాగా సెక్రటేరియన్ ను ప్రారంభోత్సవం చేసినట్లుగా వార్తలు రావటమే కాదు.. సోమవారం తెల్లవారుజామున సెక్రటేరియట్ భవనం ప్రారంభోత్సవం పూర్తి చేశారు కూడా.
ఇంతకీ సెక్రటేరియట్ భవనం సిద్ధమైందా? అంటే లేదనే చెప్పాలి. భవనం సిద్ధం కాకముందే ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టటం ఎందుకంటే.. ఈ నెల 29 తర్వాత మంచిరోజులు లేకపోవటం.. ఈ ఏడాది కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ముహుర్తాలేమీ లేవు. మరోవైపు సెక్రటేరియట్ ను జూన్ రెండో వారం నుంచి హైదరాబాద్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల చేత పని చేయించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అందుకే.. ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండటం కోసం.. తాత్కాలికంగా రెండు భవనాల్ని సిద్ధం చేసి సోమవారం ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ముందుగా నిర్ణయించిన ముహుర్తమైన తెల్లవారుజామున 4.01 గంటలకు తాత్కాలిక సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. వెలగపూడి గ్రామంలో నిర్మించిన ఈ భవనంలో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నాలుగో బ్లాకులో రెండు గదుల్ని అధికారుల్ని పూర్తి చేశారు. వీటిల్లో భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ భవనాలకు ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్ గా చంద్రబాబు పేరు పెట్టటం గమనార్హం. ఇంత భారీ పేరు పెట్టేకన్నా.. తెలుగులో సింఫుల్ గా ఏదైనా పేరు పడితే సరిపోయేది కదా..?