Begin typing your search above and press return to search.
చంద్రబాబు పొరపాటు..లోకేశ్ కు గ్రహపాటు -1
By: Tupaki Desk | 16 Feb 2016 5:29 PM GMTసగటు నిరుద్యోగులు ఎదుర్కొనే ఓ కామన్ సమస్య ఇప్పుడు చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం యువనేత లోకేశ్ కూడా ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఏ ఉద్యోగ ప్రకటన చూసినా అనుభవం అడగడం కనిపిస్తుంది.... అనుభవం లేకుంటే ఉద్యోగం ఇవ్వరు చాలామంది.. మరి ఎవరూ ఉద్యోగం ఇవ్వకుంటే అనుభవం ఎలా వస్తుంది... ఇప్పుడు లోకేశ్ ముందున్న ప్రశ్న ఇదే. ఏపీలోని టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ బాగానే వేలుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే... అయితే... అదంతా కూడా అనాథరైజ్డ్ వ్యవహారమే. మంత్రిగానో, ఇంకేదైనా పదవిలోనో ఆయన ఉంటే ఆ ముద్రకు ఉన్న గుర్తింపే వేరు. కానీ... లోకేశ్ కు ఇంతవరకు ఏ పదవీ లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడికే పదవిలేకపోవడమేంటన్న ప్రశ్న చాలామందికి వస్తుంది... తెలంగాణలో కేటీఆర్, కవిత... బీహార్లో లాలూ కుమారులు, యూపీలో ములాయం కుమారుడు ఇలా... ప్రాంతీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రుల కుమారులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటుంటే లోకేశ్ మాత్రం ఏ పదవీ లేకుండా తెరచాటు వ్యవహారాలతో సరిపెట్టుకుంటున్నారు. కొడుక్కి పెద్ద పెద్ద పదవులు అప్పగిస్తే ఎక్కడ విమర్శలు వస్తాయో అన్న భయంతో చంద్రబాబు లోకేశ్ కు అధికారికంగా ఏ పదవీ ఇవ్వలేదు. లోకేశ్ ఎదుగుదలకు ఇప్పుడు అదే గ్రహపాటుగా మారింది.
పొరుగునే తెలంగాణలో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మంత్రిగా హల్ చల్ చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో ప్రభుత్వం తరఫున అధికారిక హోదాలో నిత్యం భేటీ అవుతూ కీలక నేతగా ఎదిగిపోతున్నారు. ఆ క్రేజ్ తోనే మొన్న గ్రేటర్ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి విపరీతమైన రెస్సాన్స్ వచ్చింది. అదేసమయంలో లోకేశ్ మాత్రం ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు. ఆయనకు ప్రభుత్వపరమైన హోదా లేకపోవడంతో విదేశీ ప్రతినిధులు కానీ, స్వదేశీ పెట్టుబడిదారులు కానీ ఎవరూ ఆయనతో అధికారికంగా సమావేశం కాలేని పరిస్థితి. అంతెందుకు ఢిల్లీలో కాస్త పాపులర్ అవుదామన్న ప్రయత్నంలో లోకేశ్ అటువైపు వెళ్తున్నా అక్కడా అపాయింట్ మెంట్లు దొరకడం కష్టమవుతోందట.
ఈ నష్టం ఇప్పటితో, ఇక్కడితో ఆగడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల్లోనూ లోకేశ్ కు బచ్చా ముద్రే మిగులుతుంది. అనుభవం సంపాదించుకునే అవకాశాలు ఇప్పటికైనా కల్పించకపోతే వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఆయన్ను అమెచ్యూర్ పొలిటీషియన్ గానే భావించే ప్రమాదం ఉంది. మొన్నటి 2014 ఎన్నికల్లో జగన్ ఇదే సమస్యతో అధికారాన్ని అందుకోలేకపోయిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మొన్నటి ఎన్నికల నాటికి జగన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబుపై పూర్తి స్తాయి నమ్మకమూ ప్రజలకు లేదు. అంతా జగన్ వైపే మొగ్గుచూపినట్లుగా అనిపించింది. కానీ, ఎన్నికలు వచ్చేసరికి మేధావులు కాస్త ఆలోచించారు. జగన్ ఇంకా రాజకీయంగా అనుభవ శూన్యుడు... విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే కష్టమేమో అని భావించారు. అనుభవజ్ఙుడైన చంద్రబాబే ఇలాంటి సమయంలో తగినవారని అనుకున్నారు. తాము అనుకోవడమే కాకుండా ప్రజలకూ అదే చెప్పారు. దాంతో ప్రజలు కూడా ఆ మాట నిజమేనని గుర్తించి చంద్రబాబును గెలిపించారు. అలా అనుభవ శూన్యత కారణంగా జగన్ అధికార పీఠాన్ని అందుకోలేకపోయారు. భవిష్యత్తులో లోకేశ్ కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్రంలోనో, కేంద్రంలోనే లోకేశ్ కు పదవి ఇప్పిస్తే వ్యక్తిగతంగా ఆయనకు గుర్తింపు, అనుభవం రెండూ వస్తాయి. అది లోకేశ్ కే కాదు తెలుగు దేశం పార్టీకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.