Begin typing your search above and press return to search.

స్వీటు హాటు ఉండ‌దు.. శ్రీ‌వారి ల‌డ్డే ఇస్తారు

By:  Tupaki Desk   |   2 Jun 2015 9:46 AM GMT
స్వీటు హాటు ఉండ‌దు.. శ్రీ‌వారి ల‌డ్డే ఇస్తారు
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హాన‌గ‌రానికి భూమి పూజ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. జూన్ ఆరో తేదీన ఈ పూజ‌ను నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విస్ప‌ష్ట సూచ‌న‌లు చేశారు.

భూమిపూజ సంద‌ర్భంగా హ‌డావుడి వ‌ద్ద‌ని.. కార్య‌క్ర‌మం మొత్తం సింఫుల్ గా శాస్త్రోక్తంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. తెలుగు సంస్కృతి సంప్ర‌దాయాల విష‌యంలో ఎలాంటి లోటు లేకుండా.. పూర్తిగా ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌ర‌గాల‌న్నారు. ఉద‌యాన్నే ఇచ్చే స్వీటు హాటు స్థానే తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని ఇవ్వాల‌ని ఆయ‌న అధికారుల‌ను సూచించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భూమిపూజ మొత్తం.. అమ‌రావ‌తి మ‌న‌ది అనేలా ఉండాల‌ని.. ఒక ప‌విత్ర కార్య‌క్ర‌మంలా ఉండేలా జాగ్ర‌త్త‌లుతీసుకోవాల‌ని చెబుతున్నారు. భూమిపూజ సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన పూజ‌ల‌న్నీ.. ఎలాంటి లోటు లేకుండా చేయాల‌ని ఆదేశించారు.

జూన్ ఆరో తేదీ తెల్ల‌వారుజామున తొలుత విఘ్నేశ్వ‌ర‌పూజ‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. ఫుణ్యాహ‌వ‌చ‌నం.. అష్ఠ‌దిక్పాల‌క పూజ‌.. న‌వ‌గ్ర‌హ పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఆ స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అక్క‌డికి వస్తారు. ఆయ‌న వ‌చ్చాక గోమాత పూజ ప్రారంభిస్తారు. పూజ‌లో పాల్గొన్న అనంత‌రం.. శాంతిహోమం నిర్వ‌హిస్తారు.
పూజ‌లో కాసేపు పాలుపంచుకున్న త‌ర్వాత చంద్ర‌బాబు.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే వీవీఐపీలు.. వీఐపీల‌తో మాట్లాడ‌తారు. అనంత‌రం రాజ‌ధాని కోసం విరాళాల సేక‌ర‌ణ చేప‌డ‌తారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. బ‌హిరంగ స‌భ పూర్తయిన త‌ర్వాత విశాఖ‌కు వెళ్లేందుకు తొలుత గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌కి బాబు వెళ్ల‌నున్నారు. మొత్తంగా అమ‌రావ‌తి మ‌హాన‌గ‌ర రాజ‌ధాని పూర్తి సంప్ర‌దాయ‌ప‌బ‌ద్ధంగా జ‌ర‌గ‌నుంద‌న్న మాట‌.