Begin typing your search above and press return to search.
మంత్రిని స్వీట్ ను తినకుండా చేసిన బాబు
By: Tupaki Desk | 14 Jan 2017 9:03 AM GMTకొన్ని సందర్భాల్లో చాలాచిత్రమైన మాటల్ని చెబుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయనలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో తాను చెప్పిన మాటల్లో ఏదైనా తప్పు చెప్పి ఉంటే.. వాటి గురించి ప్రస్తావించి..గతంలో తాను అనుకున్నది.. ప్రస్తుతం అనుకుంటున్నది చెప్పేందుకు అస్సలు మొహమాట పడరు. తాజాగా అలాంటి ముచ్చటే చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ప్రపంచంలో ఎక్కడున్నా తమ మూలాల్ని మర్చిపోకూడదని చెబుతూ.. అమ్మనూ.. ఆంధ్రప్రదేశ్ ను అస్సలు మర్చిపోవద్దన్న ఆయన.. సంక్రాంతి సందర్భంగా తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను పని చేయాలంటూ వెంట పడేవాడినని.. కానీ ఇప్పుడు పని చేస్తూ.. ఆనందంగా ఉండమని చెబుతున్నానని చెప్పారు.
మంచి ఆహారం తినాలని.. స్వీట్లు ఎక్కువగా తినకూడదని చెబుతూ.. నాలుకను అదుపులో ఉంచుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నోటి నుంచి ఈ మాటలు వచ్చే సమయంలో.. వేదిక మీద ఉన్న వారికి స్వీట్లు పంచుతుండంతో ఒక్కసారి నవ్వులు వెల్లివిరిశాయి. ఇదిలా ఉంటే.. స్వీట్ తినొద్దంటూ చంద్రబాబు చెప్పే సమయానికి మంత్రి ఒకరు స్వీట్ బాక్స్ నుంచి ఒక మిఠాయిని తింటున్నారు. ఎప్పుడైతే బాబునోటి నుంచి స్వీటు తినొద్దన్న మాట వచ్చినంతనే.. వెంటనే తింటున్న స్వీటును మిఠాయి బాక్సులో పెట్టేయటం కొందరి దృష్టిని ఆకర్షించింది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటంలో తప్పు లేదు. అలా అని.. మరీ నోరుకట్టేసుకొని కూడా ఉండకూడదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. చెప్పేవిషయాన్నిమరింత స్పష్టంగా చెబితే.. ఇలాంటి ఇబ్బందులు ఉండవేమో. మొత్తానికి అధినేతమాటల్ని తూచా తప్పకుండా పాటిస్తామని సదరు మంత్రి సభా సాక్షిగా చెప్పకనే చెప్పేయటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/