Begin typing your search above and press return to search.
పవన్ విషయంలో లోకేష్ కు బాబు క్లాస్?!
By: Tupaki Desk | 9 Dec 2017 9:35 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల సుడిగాలి పర్యటనలో డీసీఐ కార్మికులకు సంఘీభావం తెలపడం - పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్థాయి పనులను అధ్యయనం చేయడం - ఫాతిమా కాలేజీ విద్యార్థులకు అండగా నిలవడంతో పాటుగా ఏపీ రాజకీయాల్లో ఇక దూకుడుగా ముందుకెళ్తాను అనే సంకేతం ఇచ్చేలా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో భేటీ అవడం...వంటివి చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఇటు వారసత్వ రాజకీయాల గురించి - ప్రాజెక్టుల్లో అవినీతి గురించి - రాష్ట్ర ప్రభుత్వం తనపట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి కూడా...పవన్ ఘాటుగానే స్పందించారు.
ఈ నేపథ్యంలోనే పవన్ ఏపీ సర్కారు తీరుపై కూడా ఘాటుగానే రియాక్టవడం గమనించవచ్చు. పోలవరం విషయంలో అనుమానాలున్నాయన్న పవన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ప్రాజెక్టు విషయంలో గట్టి పోరాటం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఫాతిమా కాలేజీ విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. స్థూలంగా ఈ పరిణామాల్లో తమ మిత్రపక్షం అనుకున్న జనసేన కూడా విమర్శించడంతో పలువురు టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడైన మంత్రి లోకేష్ మొదలుకొని...యువ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు సహా పలువురు పార్టీ నేతలు కూడా ఉన్నారు.
పవన్ కామెంట్లపై మంత్రి లోకేష్ పరోక్షంగా స్పందిస్తూ... సామర్థ్యం ఆధారంగానే వారసత్వంలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయన్నారు. వారసత్వం అయినా..నేరుగా వచ్చిన వారయినా శక్తిసామర్థ్యాలు నిరూపించుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. నారా వారి కుటుంబ ఆస్తుల సందర్భంగా లోకేష్ చేసిన ఈ కామెంట్లు పవన్ కు పరోక్షంగా ఇచ్చిన కౌంటర్ అని పలువురు చర్చించుకున్నారు. మరోవైపు పార్టీ నేతలు సైతం పవన్ కామెంట్లను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ పై టీడీపీ నేతల స్పందన శృతిమించుతోందని భావించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత - సీనీనటుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని తెలుగుదేశం నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పవన్ సానుకూలంగా అర్థం చేసుకుంటున్నారని టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు - ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కొన్ని సందర్భాల్లో పవన్ విమర్శిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు సంయమనం పాటించాలని సూచించారు. తద్వారా పరోక్షంగా ఇటు మంత్రి లోకేష్ సహా పలువురికి పవన్ పై స్పందించవద్దని హెచ్చరించారు. కాగా, ఈ సందర్భంగా పవన్-వైసీపీ మధ్య సంవాదాన్ని కూడా సీఎం చంద్రబాబు విశ్లేషించారు. పవన్ పై వైకాపా చేస్తున్న విమర్శలను వాళ్లే చూసుకుంటాని, వాటిపై పార్టీ నేతలు రియాక్ట్ అవ్వకూడదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు - అబద్ధాలు - అభూతకల్పనలు ప్రచారం చేస్తోందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు.