Begin typing your search above and press return to search.
లెక్కలు తేలిస్తే.. బొక్కలు బయటికొస్తాయా?
By: Tupaki Desk | 10 Feb 2018 1:15 PM GMTమొత్తానికి కేంద్రప్రభుత్వం ఏపీకి రావాల్సిన విభజన హామీల విషయంలో కసరత్తు ను ప్రారంబించిన సంగతి మాత్రం ఖరారే. దీనికి సంబంధించి ఏయే చెల్లింపులు ఏ రీతిలో చేయాలో... మంచి చెడులేమిటో ప్రస్తుత లెక్కలు కడుతున్నారు. ఇటువైపు చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో ఉన్న తమ బలగాలను ఫాలో అప్ చేస్తూ వెంట పడుతున్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన సమస్తం తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు ఢిల్లీలోని తమ శ్రేణులను పురమాయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే పలువురిని ఓ సందేహం పట్టి పీడిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూలోటును కేంద్రం భర్తీ చేయాలి అనేది.. విభజన చట్టం ఇస్తున్న హామీ. ఎప్పటిదాకా ఆ లోటును భర్తీ చేయాలనే స్పష్టత మాత్రం లేదు. దాన్ని కేంద్రం వక్రంగా వాడుకున్నట్లు కొందరు భావిస్తున్నారు. 14 వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చేసింది గనుక.. అది అమల్లోకి వచ్చే ముందు వరకు అంటే.. ఆంధ్రప్రదేశ్ అనాథగా ఏర్పడిన తర్వాత కేవలం పదినెలల వ్యవధికి మాత్రమే తాము లోటు భర్తీ చేస్తే సరిపోతుందని అంటున్నది కేంద్రం. ఈ విషయంలో ఏపీ వాదన మరో రకంగా ఉన్నదేమో ఇప్పటిదాకా స్పష్టం కాలేదు.
అయితే.. ఆ పదినెలల వ్యవధికి చెల్లించాల్సిన డబ్బు విషయంలోనే ఇంకా తగాదాలు నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సమర్పించిన రెవెన్యూ లోటు లెక్కలకు - కేంద్రం వేస్తున్న లెక్కలు వ్యత్యాసం వస్తోంది. దాదాపు మూడువేల కోట్లకు పైగా లెక్క ఎక్కవ చెబుతున్నట్లుగా కేంద్ర వాదిస్తూ వచ్చింది.
అయితే తాజా పరిణామాల్లో లెక్కల్లో భాజపా నాయకులు తేడా చెబితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దంటూ చంద్రబాబునాయుడు ఢిల్లీలోని తమ శ్రేణుల్ని పురమాయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త భయం ఏంటంటే.. కేంద్రం లోతులకు వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ లోటు ప్రతిపాదనలు - లెక్కలు మొత్తం స్టడీ చేసినట్లయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా లోటుపాట్లు చేసి ఉంటే గనుక.. అవన్నీ బయటకు వస్తాయా అని వారు భయపడుతున్నారు. పోలవరం విషయంలోనే చంద్రబాబునాయుడు క్రెడిబిలిటీ కేంద్రం వద్ద చాలా వరకు దెబ్బతినిందనే అనుమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. కొత్త టెండర్లు పిలవడం దగ్గరనుంచి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రభుత్వం తీరు మీద కేంద్రానికి ఉన్న అనుమానాలతో లెక్కలను పరిశీలిస్తే బొక్కలు కూడా బయటకు వస్తాయేమో అని పలువురు భయపడుతున్నారు.