Begin typing your search above and press return to search.
తమ్ముడూ.. పవన్ ను మాత్రం ఏమనొద్దు
By: Tupaki Desk | 2 Feb 2017 9:47 AM GMTఏపీ రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశం ఏపీ అధికారపక్ష నేతలు.. కార్యకర్తలు అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు అస్కారమిస్తున్నాయి. హోదాను పక్కన పెట్టేయటం.. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించటంతో పాటు.. సన్మానాలు చేయించుకోవటం ద్వారా స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయంగా తెలుగు తమ్ముళ్లంతా ఫీలైన పరిస్థితి. దీనికి తగ్గట్లే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో హోదా విషయంలో ఫీలవుతున్నా.. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన జల్లికట్టు ఇష్యూ పుణ్యమా అని తెలుగు తమ్ముళ్ల మహా ఇబ్బంది ఎదురైంది. జల్లికట్టు అంశంపై మెరీనా బీచ్ దగ్గర నిర్వహించిన నిరసన స్ఫూర్తితో హోదా మీద నిరసన నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది. దీనికి.. ఎవరూ ఊహించని రీతిలో పవన్ కల్యాణ్ నుంచి సానుకూల స్పందన రావటం.. అదే సమయంలో జగన్ సైతం హోదాపై నిరసనకు సై అనటంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఊహించని రీతిలో రెండు భిన్నధ్రువాలు ఒకే అంశంపై పోరాటానికి ఒకే సమయంలో సిద్ధం కావటంతో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. దీనికి తోడు.. హోదాపై నిరసన విషయంలో సోషల్ మీడియాలో మోతెక్కిపోవటమే కాదు.. హోదా కోసం చేస్తున్న నిరసనను అనూహ్య స్పందన రావటంతో ఏపీ సర్కారు అలెర్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో మాదిరి ఏపీ ప్రజల్లో చైతన్యం కానీ నిరసన రూపంలో బయటకు వస్తే.. హోదాపై ఉద్యమాన్ని నిలువరించటం అంత తేలికైన విషయం కాదని అర్థం చేసుకున్న ఏపీ సర్కారు.. పోలీసు పవర్ తో ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేసిందో అందరూ చూసింది.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే తెలుగు తమ్ముళ్లు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. హోదా ఇష్యూలో ఏపీ సర్కారు అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీన్నికవర్ చేసుకోవటానికి జగన్ పై విమర్శలుసంధించటం.. విరుచుకుపడటం మొదలు పెట్టారు. ఈ విమర్శల్లోకి ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకురావొద్దన్న మాటను ఏపీ అధికారపక్ష నేతలు స్పష్టం చేయటంతోపాటు.. ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
హోదాపై జగన్ చేసే పోరాటాన్ని తప్పు పట్టాలని.. ఏదో ఒక నింద వేయాలని.. అదే సమయంలో పవన్ ప్రస్తావన ఎంతమాత్రం తేవొద్దంటూ ఏపీ అధికారపక్షం ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో.. అందరి టార్గెట్ జగన్ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు పలువురు పవన్ ప్రస్తావన తీసుకురారేమిటంటూ తెలుగు తమ్ముళ్లను నిలదీయటం.. హోదాను సమర్థించిన జగన్ పై చేసే విమర్శలు.. పవన్ కూడానా? అన్న మాటకు తెలుగు తమ్ముళ్లలో తడబాటు కనిపిస్తోంది. తాము జగన్ ను విమర్శిస్తామే కానీ.. పవన్ ను పల్లెత్తు మాట అనటం లేదని చెప్పటం విశేషం. ఈ సందర్భంగా తమ అధినేత కూడా పవన్ కల్యాణ్ ను ఒక్క మాట కూడా అనటం లేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తుండటం గమనార్హం. చూస్తుంటే.. హోదా మీద తెలుగు తమ్ముళ్లు చేసే వాదనలన్నీ జగన్ సెంట్రిక్ గానే కానీ.. పవన్ ప్రస్తావన తీసుకురాకపోవటం చూస్తే ప్రత్యేక హోదా మీద వారికున్న అభిమానం ఏమిటన్నది ఇట్టే తెలిసే పరిస్థితన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/