Begin typing your search above and press return to search.
అమిత్ షాతో మాట్లాడి వచ్చినప్పుడే అర్థమైపోయింది
By: Tupaki Desk | 4 Feb 2018 10:10 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలతో ఈ రోజు భేటీ కావడానికి ముందు ఎంతో హడావుడి.. ఏదో జరిగిపోతుందన్న అలజడి.. బీజేపీ - టీడీపీ బంధం తెగిపోతుందన్న ప్రచారం.. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ ఎంపీల పెద్దపెద్ద మాటలు. కానీ, ఆ భేటీ జరగడానికి కొద్దిసేపటి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ - ఆ తరువాత పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ.. చివరకు తేలిందేంటంటే, పార్లమెంటు వేదికగా రాష్ర్ట సమస్యలపై టీడీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని నిర్ణయించడం. అదీ ఎంపీలతో చంద్రబాబు భేటీలో తేల్చిన విషయం. పొత్తు చెదరలేదు.. బీజేపీ బెదరలేదు... ఎప్పటిలా చంద్రబాబు విషయాన్ని నాన్చేశారంతే. దీంతో అమిత్ షా ఫోన్ చేసి చంద్రబాబు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చెప్పారన్న కొత్త ప్రచారం ఒకటి మొదలైంది. అందుకే చంద్రబాబు ఇలా తేల్చేసారని తెలుస్తోంది.
అయితే... భేటీలో చంద్రబాబు పార్లమెంటు వేదికగా పోరాటమే మార్గంగా ఎంపీలకు సూచించినట్లు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. సైలెంట్ గా కూర్చుంటే కుదరదని ఆయన అన్నారు. రాష్ర్ట హక్కుల కోసం పోరాడాలని - సస్పెండ్ అయిన ఫర్వాలేదని.. సభలో నిరసనలు - ఆందోళనలతో హోరెత్తించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
పనిలో పనిగా ఆయన ఏపీ బీజేపీ నేతలు - వైసీపీ అధినేత జగన్ పైనా ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ఫోటోలు పెట్టలేదని కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని… అది నిజం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంకా నాటకాలాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కాగా ఎంపీలు రాజీనామా చేయాలని, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని పలువురు ఎంపీలు సూచించగా చంద్రబాబు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.