Begin typing your search above and press return to search.
చంద్రబాబు : జాతీయ హీరోగా ఎదిగే యత్నం!
By: Tupaki Desk | 12 April 2018 6:30 AM GMTచంద్రబాబునాయుడు ఏదో రాష్ట్రంలో అభివృద్ధి పడక వేయడానికి.. పనులన్నీ ఎక్కడివక్కడ స్తంబించి ఉండడానికి తన పాపం ఏమీ లేదని.. అంతా మోడీదేనని చాటిచెప్పడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే ఇన్నాళ్లూ మనకు కనిపించాయి.! తీరా ఆయన ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయమే తన ప్రధాన ఎజెండా అని ఆయన చెప్పుకున్నారు. కొందరు నమ్మారు. కొందరు అనుమానాస్పదంగా చూశారు.
తీరా ఇప్పుడు ఆయన ఆలోచనల్లోని అసలు మర్మం బయటపడుతోంది. 2019 తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా చేయవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబునాయుడు అండ్ కో తాజా కదలికలు అలాగే కనిపిస్తున్నాయి.
జాతీయ మీడియా ప్రతినిధులను అమరావతికి పిలిపించి.. తాము ఎంత గొప్ప నగరం నిర్మంచబోతున్నామో.. యావత్ దేశానికి చాటి చెప్పడానికి గురువారం చంద్రబాబు సర్కార్ ప్రయత్నం ప్రారంభించింది. జాతీయ మీడియా ప్రతినిధులను పిలిపించి.. అమరావతి నగరం కోసం రూపొందించిన.. వివిధ భవనాకృతుల మోడల్స్ అన్నింటినీ వారికి కమిషనర్ శ్రీధర్ చూపించి వివరించారు.
అంటే ఈ బొమ్మలను యావత్ దేశానికి చూపించి.. దేశంలో ఎక్కడా లేనంత గొప్ప నగరాన్ని చంద్రబాబు నిర్మించబోతున్నాడంటూ వారు చాటి చెప్పాలన్నమాట. తద్వారా దేశం మొత్తం.. చంద్రబాబు వంటి నాయకుడు దేశంలో మరెక్కడా లేడని విస్తుపోయి.. ఆయనను ఆరాధ్య భావంతో చూడాలన్నమాట. ఆయన ఆలోచన బహుశా ఇదే అయి ఉండవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది.